BigTV English

Navjot Singh Sidhu on Travis Head: వేలు పెట్టి గెలికేసిన ట్రావిస్ హెడ్.. రంగంలోకి ICC ?

Navjot Singh Sidhu on Travis Head: వేలు పెట్టి గెలికేసిన ట్రావిస్ హెడ్.. రంగంలోకి ICC ?

Navjot Singh Sidhu on Travis Head: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్ట్ లో భారత జట్టు 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు 1 – 2 తో వెనుకంజలో నిలిచింది. ఈ నాలుగవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు తీవ్రంగా నిరాశపరిచారు.


Also Read: Irfan Pathan on Rohith Sharma: కెప్టెన్ అయ్యి బతికిపోయాడు.. లేకపోతే రోహిత్ ను పీకి పడేసేవారు !

దీంతో భారత జట్టుకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీలకంగా మారింది. కానీ అతను కూడా నిర్లక్ష్య పూరిత బ్యాటింగ్ తో పెవిలియన్ చేరాడు. అప్పటివరకు సజావుగా సాగుతున్న భారత ఇన్నింగ్స్.. పంత్ వికెట్ కోల్పోగానే ఒక్కసారిగా సైకిల్ స్టాండ్ ని తలపించింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా పెవిలియన్ బాట పట్టారు. అయితే పంత్ వికెట్ తీసిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.


హెడ్ తన ఫింగర్ సెలబ్రేషన్ తో సోషల్ మీడియాను అల్లాడించాడు. ఈ వేడుకను చాలామంది అశ్లీలంగా భావించారు. అయితే వికెట్ తీసిన సందర్భంలో చేతి వేలిని మరో చేతిలో పెట్టి తిప్పుతూ ట్రావిస్ హెడ్ చేసిన సెలబ్రేషన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు. హెడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కి విజ్ఞప్తి చేశారు. హెడ్ 150 కోట్ల భారత ప్రజలను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అసభ్యకరమైన సెలబ్రేషన్ పై సిద్దు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ” మెల్ బోర్న్ టెస్ట్ లో హెడ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉంది. ఇది జెంటిల్ మెన్ గేమ్ కి ఏ మాత్రం మంచిది కాదు. మ్యాచ్ ని చిన్నపిల్లల నుంచి మహిళలు, కుర్రాళ్ళు, పెద్దల వరకు చూస్తుంటారు. ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. అతడు ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అలాంటి సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ఇంత నీచంగా వ్యవహరించడం సరైనది కాదు.

Also Read: Gautam Gambhir: గంభీర్‌ కు బిగ్‌ షాక్‌.. టీమిండియాకు కొత్త కోచ్‌ ?

భవిష్యత్తులో ఎవ్వరూ ఇలాంటి పనిచేయకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు” అని ట్వీట్ చేసి బీసీసీఐ, ఐసీసీలకు ట్యాగ్ చేశాడు సిద్దు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్ ని గుర్తు చేశాడని చెబుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమీన్స్ కూడా ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో చెబుతూ దానిని ఒక జోక్ గా అభివర్ణించాడు. ఏది ఏమైనా ఇది ఓ అసభ్యకరమైన చర్య అని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

 

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×