TDP on BCs: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా నడుస్తున్నాయి. గడిచిన ఆరునెలల్లో వైసీపీకి చుక్కలు చూపించారు కూటమి ప్రభుత్వం. కూటమి స్కెచ్‌కు ఫ్యాన్ నేతలు, కేడర్ కకావిలకం అవుతోంది. ఓ అడుగు ముందుకేసిన పవన్ కల్యాణ్.. వైసీపీ కోటలో క్యాంప్ కార్యాలయానికి ప్లాన్ చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం వైపు వెళ్తుండగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీ కోటలను బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఫలితంగా నేతలు వలసబాట పడుతున్నారు.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేవలం బీసీల మీద ఆధారపడతాయి. రాజకీయ పార్టీలు సైతం బీసీలకు ప్రయార్టీ ఇస్తున్నాయి. కాకపోతే కొత్త నేతలు రావడం లేదన్నది అసలు ప్రశ్న. ఉన్నవారికే పదవులు ఇస్తున్నారు. ట్రెండ్‌ను గమనించిన కూటమి సర్కార్, జాగ్రత్తగా అడుగులేస్తోంది.
రాజకీయంగా కాకుండా.. అధికారులకు సైతం పెద్ద పీఠ వేస్తున్నారు. రీసెంట్‌గా ఏపీ చీఫ్ సెక్రటరీగా బీసీలకు చెందిన విజయానంద్‌ను నియమించింది. అంతకుముందు టీటీడీ ఈవోగా శ్యామలరావు, డీజీపీగా ద్వారకా తిరుమలరావు వీరంతా బీసీలకు చెందినవారే.. వారినే ఉన్నత పదవులపై కూర్చోబెట్టింది.
ALSO READ: కస్టోడియల్ టార్చర్ కేసులో కొత్త కోణం, ఆ వ్యక్తికి నోటీసు
రాజకీయంగా అయితే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా శ్రీనివాస్, కేంద్ర మంత్రి రామ్మోహన్, స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఇలా ఎవరు చూసినా ఆయా నాయకులంతా బీసీ వర్గానికి చెందినవారే. వైసీపీ పాలనకు వస్తే అప్పట్లో సామాజిక సమతుల్యత లోపించింది.
బీసీలకు తామే బ్యాక్ బోన్ అంటూ ప్రచారం ఊదరగొట్టింది. వైసీపీ రూలింగ్‌లో సీఎస్, డీజీపీ, టీటీడీ ఛైర్మన్ ఇలా ఏది చూసినా జగన్ తన వర్గం వారికే ప్రయార్టీ ఇచ్చారు. వెనుకబడిన వర్గాలను దూరంగా పెట్టారన్నది వాదన కొందరి అధికారుల్లో లేకపోలేదు. దాన్ని గమనించిన కూటమి సర్కార్, ఇరువైపులా బ్యాలెన్స్ చేసుకుని అడుగులేస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం ఆరునెలలు మాత్రమే. మరో నాలుగున్నరేళ్లు ఇంకెన్ని అస్త్రాలు వైసీపీపై ఎక్కుపెడుతోందో చూడాలి. కూటమి దూకుడికి ఏం చెయ్యాలో తెలియక ఫ్యాన్ పార్టీ నేతలు కంగారు పడిన సందర్భాలు లేకపోలేదు. నేతలు పైకి గుంబనంగా కనిపించినా లోపల మాత్రం టెన్షన్ వెంటాడుతోంది. లేటెస్ట్‌గా బీసీల మంత్రంపై టీడీపీ చిన్న వీడియోను రిలీజ్ చేసింది. వాటిపై ఓ లుక్కేద్దాం.
బీసీలకు చంద్రబాబు గారు ఇచ్చే ప్రాధాన్యానికి నిదర్శనం ఈ పదవులు. ఏపీ పాలన యంత్రాంగంలో అత్యున్నతమైన చీఫ్ సెక్రటరీ, డీజీపీ, టీటీడీ ఈవోలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రులుగా, స్పీకర్‌గా, ఏపీ టీడీపీ అధ్యక్షునిగా అత్యున్నత పదవులకు బీసీల నేతలనే ఎంపిక చేసింది… pic.twitter.com/KmTw4YzrhT
— Telugu Desam Party (@JaiTDP) December 30, 2024