E-Paper
Advertisement

IND VS NZ 1st T20I: రేప‌టి నుంచే టీ20 సిరీస్‌..టీమిండియా ప్ర‌తీకారం తీర్చుకుంటుందా ? టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

IND VS NZ 1st T20I: రేప‌టి నుంచే టీ20 సిరీస్‌..టీమిండియా ప్ర‌తీకారం తీర్చుకుంటుందా ? టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే
Advertisement

IND VS NZ 1st T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరో ఫోరు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేలు పూర్తయ్యాయి. ఇందులో న్యూజిలాండ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, సిరీస్ గెల్చుకుంది. ఇక రేపటి నుంచి న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 5 t20 ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరిస్తాడు.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

నాగపూర్ వేదికగా మొదటి టి20

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ( IND VS NZ 1st T20I ) ప్రారంభం కానుంది. మొట్టమొదటి టి20 నాగపూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్కు ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఇండియాలోనే మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో రాత్రి 7:30 గంటలకు లైవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఇక ఈ విదర్భ క్రికెట్ స్టేడియంలో మొదటి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది.

చలికాలం కావడంతో సెకండ్ బౌలింగ్ చేసే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొగమంచి విపరీతంగా ఉండటం కారణంగా బౌలింగ్ చేయడం చాలా రిస్క్. కాబట్టి టాస్ గెలిచిన జట్టు.. మొదట బౌలింగ్ చేస్తే బెటర్ అంటున్నారు. ఇక రేపటి మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే, టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వ‌న్డే సిరీస్ జ‌రుగ‌గా, ఆ సిరీస్ లో కివీస్ విజ‌యం సాధించింది. టైటిల్ ఎగురేసుకుపోయింది. కానీ ఇప్పుడు 5 టీ20ల సిరీస్ ను టీమిండియా గెలుచుకుని, ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని సిద్ధం అవుతోంది.

Advertisement

 

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల అంచనా

టీమిండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ (వైస్-కెప్టెన్).

న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి మరియు క్రిస్టియన్ క్లార్క్  డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, బెవాన్ జాకబ్స్.

Also Read: BCCI Central Contract: ‘A+’ కేటగిరీ ఎత్తివేత‌..ప్లేయ‌ర్ల జీతాల్లో భారీ కోత..ఆ స్లాబ్ లోకి రోహిత్‌, కోహ్లీ !

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×