Peddireddy On Chandrababu: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అప్పుడు సూపర్ సిక్స్ అన్నారని, ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ లేదని చివరకు గుండు సున్నా మిగిలిందన్నారు.
శ్రీలంక మాదిరిగా ఏపీ తయారైపోయిందని ఆనాడు అన్నారని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంత పాడారన్నారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చానని అంటారని తెలిపారు.
చెప్పింది చేసే నాయకుడు జగన్ అని, ఆనాడు వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే పప్పు బెల్లాలని అన్నారని గుర్తు చేశారు. మోసం చేసిన ఇలాంటి నేతలు రాజకీయాల్లో కొనసాగించవచ్చా అంటూ మండిపడ్డారు. ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారని, కేవలం 7 నెలల్లో 1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారని వ్యాఖ్యానించారు.
ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఎంత ఇచ్చారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. రెండేళ్లు కొవిడ్ ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని అందించామని వివరించారు. ఆరోగ్య శ్రీతో పాటు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తే నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారని ఆరోపించారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా? అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం నిజం కాదా అంటూ రుసరుసలాడారు.