Big Stories

YSRCP Manifesto 2024: వైసీపీ పవిత్ర గ్రంథం, రెండు పేజీలు అవసరమా అంటూ..

People Satire on YSRCP Manifesto 2024 released by CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో పార్టీలు తమ మేనిఫెస్టోలపై దృష్టిపెట్టాయి. మేనిఫెస్టో పవిత్రగ్రంథమంటూనే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో పోల్చింది అధికార పార్టీ. గతంలో తాము ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని పదేపదే చెప్పుకొచ్చింది. అంతేకాదు చెప్పినవే కాకుండా చెప్పలేవని కూడా అమలు చేశామని సాక్షాత్తూ సీఎం జగన్ పలుమార్లు సభలో చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారు? ఇక అందరికంటే ముందుగానే అధికార వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.

- Advertisement -

గతంలో మాదిరిగానే ఈసారి రెండు పేజీలతో కూడిన తొమ్మిది హామీలను మేనిఫెస్టోలో పేర్కొంది. అన్నింటి కంటే ముఖ్యమైనది అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందజేయడం. పట్టణాల్లో సెంటు, పల్లెటూరులో సెంటున్నరకు ఇళ్లు కట్టించి ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని జగన్ ప్రభుత్వం తెగ గొప్పలు చెప్పుకొంది. ఈ స్కీమ్ పేరిట ఏకంగా ఊళ్లకు ఊళ్లనే నిర్మించామని ఢంకా బజాయించింది.

- Advertisement -

మూడురోజుల కిందట ఏపీకి వచ్చిన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియూష్‌ గోయల్ మాత్రం మూడున్నర లక్షల ఇళ్లు మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. మరి 25 లక్షల ఇళ్లు ఎక్కడ? అధికార పార్టీ చెప్పినట్టు అన్ని లక్షల ఇళ్లు ఇస్తే.. ఇంకా పేదలున్నారా? ఇక పెన్షన్లు విషయానికొద్దాం. టీడీపీ రూలింగ్‌ లో ఉన్నప్పుడు రెండు వేలు ఇచ్చేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లులో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచింది.

తాజాగా మేనిఫెస్టోలో మరో 500 పెంచుతామని అదీ రెండు విడతల్లో మాత్రమే ఇస్తామని పేర్కొంది వైసీపీ. టీడీపీ అధినేత చంద్రబాబు నెలకు 4000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు పింఛను నెలకు ఆరువేలు పెంచుతామన్నారు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇచ్చిందా? అవుననే అంటోంది  ఫ్యాన్ పార్టీ. కాకపోతే ఆ డబ్బులు తల్లుల అకౌంట్‌లో వేసింది. ఇంటి అవసరాల నిమిత్తం వినియోగించు కున్నారు. బకాయిలు ఉన్నాయంటూ ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు  పలు కళాశాలలు.

Also Read: 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల.. వాటికే పెద్దపీట

గతంలో తాము అధికారంలోకి వస్తే ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ప్రస్తావించింది. అందులో ఆర్టీసీ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు ఇవన్నీ కలిసి ఐదు లక్షలు ఉద్యోగాలు. చెప్పినట్టుగానే ఐదు లక్షలు జాబ్‌లు ఇచ్చేసింది. అమ్మఒడి స్కీమ్‌కి గతంలో 15వేలు ఇవ్వగా ఇప్పుడు 17వేలకు పెంచారు. అందులో మెయింట్‌నెన్స్ పేరిట ప్రభుత్వం కోత విధించిందనేది చిన్నారుల తల్లుల ఆవేదన. కొత్తగా ప్రతీ నియోజకవర్గంలో స్కిల్స్ హబ్ ఏర్పాటు చేస్తామని, జిల్లాకు ఒక కాలేజీ, తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేశారు పార్టీ అధినేత జగన్.

జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు 2019లో జగన్ చెప్పుకొచ్చారు. అందులో ఇప్పటివరకు ఎన్ని అయ్యాయో ఎవరికీ తెలీదు. కాకపోతే ఆన్‌లైన్‌లోనే శంకుస్థాపనలు, ఓపెనింగ్‌లు కనిపిస్తున్నాయి. అవి ఎంతవరకు పూర్తి అయ్యాయో తెలీదన్నది విపక్షం నుంచి బలంగా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం జగన్ మేనిఫెస్టోను చూసినవాళ్లు కూటమి నేతలైతే 9 హామీలకు రెండు పేజీలు ఎందుకంటూ సెటైర్లు వేస్తున్నారు. సింపుల్‌గా నోటితో చెబితే సరిపోయిదని అంటున్నారు. వైసీపీ నేతలు సైతం పార్టీ మేనిఫెస్టోపై రకరకాలు చర్చించుకోవడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News