E-Paper
Advertisement

విజయా డైరీపై లోకేష్ కుట్రలు.. బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు!- పేర్ని నాని

విజయా డైరీపై లోకేష్ కుట్రలు.. బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు!- పేర్ని నాని
Advertisement

Perni Nani: కంచే చేను మేసిన చందంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. నారా లోకేష్ ధనదాహం కోసం సహకార రంగంలో ఎంతో విజయవంతంగా నడుస్తున్న విజయా డైరీపై కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, విజయా డైరీని నాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక రెడ్ బుక్ రాజ్యాంగ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.

ఐసీయూలోనే బెదిరింపులు..

Advertisement

మండవ జానకీ రామయ్య బాటలో నడిచిన చలసాని ఆంజనేయులు విజయా డైరీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఏటా వెయ్యి కోట్ల వ్యాపార లావాదేవీలతో సంస్థను తీర్చిదిద్దారని పేర్ని నాని తెలిపారు. దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల హయాంలో సహకార డైరీల అభివృద్ధికి పెద్దపీట వేశామని గుర్తుచేశారు. అయితే హెరిటేజ్ ఆస్తులను పెంచుకునే కుట్రలో భాగంగానే విజయా డైరీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులును ఐసీయూలోకి వెళ్ళి మరీ ఇద్దరు మంత్రులు బెదిరింపులకు గురిచేసి రాజీనామా చేయించడం దారుణమన్నారు.

కూటమి నేతల వేధింపులతోనే గుండెనొప్పి

Advertisement

రాజీనామా చేయకపోతే అక్రమ కేసులు బనాయించి, కొడుకు, కూతురిని అరెస్ట్ చేయిస్తామని బెదిరించడం వల్లే ఆంజనేయులుకు గుండెనొప్పి వచ్చిందని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన చైర్మన్‌ను తొలగించే హక్కు మంత్రులకు ఎక్కడిదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే కాక, పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకులపైనే వేధింపులకు దిగుతోందని విమర్శించారు.

అక్రమార్కులు ఊసలు లెక్కబెట్టడం ఖాయం

పాలు, పాల పదార్థాల విక్రయాల ద్వారా లాభాల్లో నడుస్తున్న విజయా డైరీకి చెందిన వేలకోట్ల విలువైన ఆస్తులను కబళించేందుకు లోకేష్ నాయకత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయని దుయ్యబట్టారు. సహకార సంఘాల సొత్తును అక్రమార్కుల పాలు చేయనివ్వమని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ కుట్రలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని, వారు ఊసలు లెక్కబెట్టడం ఖాయమని హెచ్చరించారు.

Also Read: ఫోన్‌లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×