E-Paper
Advertisement

రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!

రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!
Advertisement

Samsung Foldable Phones: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న గెలాక్సీ 8వ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లు భారత మార్కెట్లో అధికారికంగా అమ్మకానికి వచ్చేశాయి. ప్రీ-ఆర్డర్ కాలం ముగియడంతో ఇప్పుడు Galaxy Z Fold 8, Fold 8 Ultra, అలాగే Z Flip 8 ఫోన్లు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

డిజైన్, డిస్‌ప్లే విశేషాలు:

ఈ కొత్త సిరీస్‌లో ప్రతి మోడల్ ఒక ప్రత్యేక శైలిని కలిగి ఉంది. Z Fold 8 పుస్తకంలా మడతపడే డిజైన్‌తో వస్తే.. Ultra మోడల్ సాధారణ ఫోన్లా ఉంటూనే విప్పితే టాబ్లెట్‌లా మారుతుంది. ఇక కాంపాక్ట్ సైజ్ ఇష్టపడే వారి కోసం Z Flip 8 క్లామ్‌షెల్ స్టైల్‌లో అందుబాటులోకి వచ్చింది. మూడింటిలోనూ మెరుగైన బ్రైట్‌నెస్, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో కూడిన అద్భుతమైన డైనమిక్ AMOLED స్క్రీన్లను అందించారు.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీగా తగ్గిన Samsung Galaxy S25 FE ధర.. ఆఫర్ వివరాలు ఇవే!

శక్తివంతమైన పెర్ఫార్మన్స్:

మూడు ఫోన్లలోనూ క్వాల్కమ్ ప్రొఫెసర్లని వాడటంతో పనితీరు విషయంలో దేనికీ తీసిపోవు. Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, Android 17 ఆధారిత OneUI 9 సాఫ్ట్‌వేర్‌పై ఇవి పనిచేస్తాయి. మోడల్‌ను బట్టి 12GB లేదా 16GB ర్యామ్ ఎంపికలు ఉన్నాయి. అయితే.. ఫోన్ సైజును బట్టి బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగంలో చిన్నపాటి మార్పులు ఉంటాయి.

క్యామెరా ప్రత్యేకతలివే:

Advertisement

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. Z Fold 8 Ultra ముందువరుసలో ఉంది. దీనిలో ఏకంగా 200MP ప్రధాన క్యామెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. standard Fold 8, Flip 8 మోడళ్లలో 50MP ప్రధాన కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం అన్నింటిలోనూ నాణ్యమైన ఫ్రంట్ కెమెరాలను అమర్చారు.

ధరల వివరాలు ఇలా:

ఇక ధరల పరంగా చూసుకుంటే.. Z Flip 8 ప్రారంభ ధర రూ.1,24,999గా ఉంది. అలాగే Z Fold 8 ధర రూ.1,79,999 నుంచి, టాప్ ఎండ్ Fold 8 Ultra ధర రూ.1,99,999 నుంచి ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ EMI వెసులుబాటును శాంసంగ్ కల్పిస్తోంది.

Also Read: భారీ బ్యాటరీ, ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్.. భారత్‌లో విడుదలైన Vivo S2 ఫోన్ పూర్తి వివరాలు!

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×