BigTV English

Perni Nani Comments: పక్కా ప్లాన్ ప్రకారమే దారుణాలకు పాల్పడ్డారు: పేర్ని నాని

Perni Nani Comments: పక్కా ప్లాన్ ప్రకారమే దారుణాలకు పాల్పడ్డారు: పేర్ని నాని

Perni Nani Comments on AP Police about AP Violence: ఏపీలో సార్వత్రిక ఎన్నికల తరువాత చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని ఫైరయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ తరువాత జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. ఆ ఘటనలపై పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదన్నారు. రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా నియమిస్తే ఏం జవాబుదారీతనం ఉంటుందని ఆయన అన్నారు.


‘టీడీపీ వారు యథేచ్చగా కర్రలతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురుతిరిగితే మాపై కేసులు పెడుతున్నారు’ అని పేర్ని నాని అన్నారు. ‘మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి చెప్పినట్టు పోలీస్ అధికారులను మార్చినచోట హింస జరిగింది.. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు’ అని ఆయన అన్నారు. హింసాత్మక ఘటనలపై డీజీపీని కలిశామని ఆయన చెప్పారు.

అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ కక్షతోనే దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీకి ఓట్లు ఎక్కువ వస్తాయనుకున్న చోటనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారన్నారు. బడుగు, బలహీన వర్గాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు దాడులు జరుగుతుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.


Also Read: AP Elections: ఢిల్లీలో ఈసీతో ముగిసిన ఏపీ సీఎస్‌, డీజీపీ సమావేశం

అదేవిధంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి వైసీపీకి ఓటు వేశారన్నారు. ఓటమి భయంతో కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ఆయన అన్నారు. జూన్ 4న సంబరాలకు సిద్ధం కావాలంటూ ఆయన వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని.. మరోసారి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఖావడం అంటూ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

Tags

Related News

Heavy Rains in AP: బాబోయ్ .. కుమ్మేస్తున్న వానలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Big Stories

×