YSRCP : రెడ్ బుక్‌లో టాప్ నేమ్స్ ఎవరివో తెలుసుగా? కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, పోసాని, బోరుగడ్డ.. ఇలా చాలామందే ఉన్నారు. అందులో నెంబర్ వన్ నేమ్ కొడాలి నాని. ఆయన టైమ్ రాకముందే హాస్పిటల్ బెడ్ ఎక్కేశారు. గుండె నొప్పితో ఏపీని వీడిపోయారు. వల్లభనేని వంశీ పాపం పండింది. టీడీపీ కార్యకర్తను కొట్టి బెదిరించిన కేసులో అరెస్ట్ అయి ఊచలు లెక్కబెడుతున్నాడు. పోసాని, బోరుగడ్డ అనిల్‌లో జైలు తిండి తిన్నారు. ఇంకా చాలామందే ఉన్నా.. పేర్ని నాని మాత్రం తరుచూ మిస్ అవుతున్నారు. ఈసారి మాత్రం పేర్నిని పక్కా పట్టుకుని లోపలేసుడేనంటూ కూటమి ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. ఆ సమయం రానే వచ్చింది. ఆయన భార్యకు ఉచ్చు బిగించి.. నానిని కన్నెంలోంచి బయటకు రప్పించేలా పొగ పెడుతున్నారు ఏపీ పోలీసులు.
పేర్ని జయసుధ బెయిల్ రద్దు అయ్యేనా?
పేర్ని జయసుధ బెయిల్‌పై పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే టెన్షన్ పేర్ని నాని పీడిస్తోందట. పేర్ని నానికి చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలించారనే కేసులో A1గా జయసుధ, A6గా నాని ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. ఒకవేళ బుధవారం జయసుధ బెయిల్ రద్దు అయితే..? ఆమె అరెస్ట్ ఖాయం. ఆ తర్వాత పేర్ని నాని చేతికీ సంకెళ్లు పడటం పక్కా.
పేర్ని దూకుడుకు బ్రేకులు పడేనా?
ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్ని నాని నోటికి అంతే లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు పవన్ కల్యాణ్ మీద ఓ రేంజ్‌లో రెచ్చిపోయేవారు. వరుస ప్రెస్‌మీట్లతో విరుచుకుపడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. రేషన్ బియ్యం కేసు చుట్టుకున్నాక.. పేర్ని నాని దూకుడు తగ్గించారు. నోటికి తాళం వేసుకున్నారు. భార్యకు బెయిల్ వచ్చాక మళ్లీ నోటికి పని చెప్పడం స్టార్ట్ చేశారు. వల్లభనేని, పోసానిల అరెస్టు తర్వాత మళ్లీ గొంతు పెంచారు. ఇక ఊరుకుంటే ఇలానే రెచ్చిపోతారని భావించి.. పేర్ని జయసుధ బెయిల్ రద్దుకు హైకోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వం. నానికి చెక్ పెట్టేలా అలా పావులు కదిపింది.
Also Read : రఘురామ కేసులో జగన్‌కు చిక్కేనా?
ఇంత జరుగుతున్నా పేర్ని నాని తగ్గేదేలే.. జైలుకైనా వెళ్లేందుకు రెడీ అంటున్నారు. కూటమి ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని, జగన్‌ను వదిలిపెట్టనని చెబుతున్నారు. రాజకీయ వేధింపులకు భయపడేదే లేదన్నారు. రేషన్ బియ్యం నష్టానికి ఇప్పటికే పరిహారం చెల్లించినా తన భార్యపై కావాలనే కేసు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తన భార్యపై ఏడేళ్ల పైబడి శిక్ష పడేలా కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ తన కుటుంబం మీద మినహా.. ఇప్పటి వరకూ ఎవరి మీదా క్రిమినల్ కేసులు పెట్టలేదని ఇదేమి న్యాయం అంటూ నిలదీశారు మాజీ మంత్రి నాని.
పైకి ఇలా గంభీరంగా మాట్లాడుతున్నా.. పేర్నిలో భయం లేకపోలేదు. బుధవారం తన భార్య బెయిల్ రద్దు అయితే ఏంటి పరిస్థితి? ఆమెను బయటకు తీసుకొచ్చేదెలా? అసలు టార్గెట్ తానే కాబట్టి.. తాను తప్పించుకునేదెలా? అంటూ లోలోన ఫుల్ టెన్షన్ పడుతున్నారట పేర్ని.