BigTV English

Perni Nani: వైసీపీని దెబ్బతీసేందుకు కూటమి కుట్ర: పేర్ని నాని

Perni Nani: వైసీపీని దెబ్బతీసేందుకు కూటమి కుట్ర: పేర్ని నాని

Perni Nani latest comments(Andhra politics news): వైసీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. వైసీపీపై కుట్రతోనే నాయకులు, కార్యకర్తలపై అధికార కూటమి కేసులు పెడుతుందని తెలిపారు. అంతే కాకుండా వారిని భయాందోళనలకు గురి చేస్తోందని మండిపడ్డారు. సుదీర్ఘంగా పార్టీకి నష్టం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేయడాన్ని పేర్ని నాని తీవ్రంగా ఖండించారు.


అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ముందస్తు విచారణ లేకుండా జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశారని తెలిపారు. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా వైసీపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. టీడీపి చేస్తున్న తప్పులను అడుగడుగునా నిలదీస్తామని అన్నారు. అంతే కాకుండా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

వైసీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాల అమలు చేయకుండా వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవని అన్నారు. 2022లో పేపర్ ప్రకటన జోగి రమేశ్ ఇచ్చారు మని తెలిపారు. ఆయన దగ్గర స్థలం కొన్న వారు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సీబీఐ కూడా ఎక్కడా అభ్యంతరాలు తెలపలేదు. ఆగస్ట్ 2 న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టి కక్ష పెట్టుకుని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారని పేర్ని నాని మండిపడ్డారు.


Also Read: కోర్టులో జోగి రాజీవ్‌ను హాజరుపరిచిన ఏసీబీ

175 నియోజక వర్గాల్లో అందరినీ జైల్లో వేసినా కూడా పోరాటం ఆపము. టీడీపీ చేసే తప్పులపై కచ్చితంగా పోరాటం చేస్తాం. 2029లో టీడీపీని కూలగొట్టేందుకు కావాల్సిన శక్తిని కూడగట్టుకుంటాము. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు.. అమ్మినవారు చంద్రబాబు బంధువులు అయి ఉంటారు. అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి మానసికంగా ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ వేధిస్తున్నారు. ఒకే ఘటనకు రెండు కేసులు పెట్టారు. మానసిక ఆనందం తాత్కాలికమని పేర్ని నాని పేర్కొన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×