Pitapuram: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖాలో జిల్లా కలెక్టర్ కు అవమానం ఎదురైంది. ఓ కాంట్రాక్టర్ తన బిల్లుల కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చి, ఏకంగా జిల్లా కలెక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కు అవమానం జరగడం సంచలనం సృష్టించింది.
పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టర్ షన్మోహన్ నిర్వహించారు. ఉదయం నుండి ప్రజల యొక్క సమస్యలపై అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ కార్యక్రమం కావడంతో పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ బిల్లుల జాప్యం జరుగుతుందంటూ ఓ కాంట్రాక్టర్ తన వినతి పత్రాన్ని అందించేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కాంట్రాక్టర్ మధ్య వాగ్వివాదం సాగింది.
అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సురవరపు దివానం.. పథకం ప్రారంభించిన సమయం నుండి ఒక్క రూపాయి బిల్లులు రావడం లేదంటూ, జిల్లా కలెక్టర్ ను నిలదీశారు. గట్టిగా కేకలు వేస్తూ కాంట్రాక్టర్ మాట్లాడడంతో, కలెక్టర్ సైతం నివ్వర పోయారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా, బిల్లులు రాని పరిస్థితి ఉందని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన కలెక్టర్.. అతి త్వరలోనే వస్తాయని, ఈ బిల్లుల కోసం కాంట్రాక్టర్ రావాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు. తనను రావద్దని అనడం కరెక్ట్ కాదని జిల్లా కలెక్టర్ తో విభేదించిన కాంట్రాక్టర్, ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.
Also Read: Jamili Elections: జమిలీ కోసం.. కమిలి పోతున్న పార్టీలు.. ఆశలు గల్లంతేనా?
అన్నా క్యాంటీన్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ నిలదీయడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని, కాంట్రాక్టర్ ను అక్కడ నుండి పంపించి వేశారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో అన్నా క్యాంటీన్ బిల్లులు రాని పరిస్థితిలో, కాంట్రాక్టర్ ఆవేదన వెళ్లగక్కడం అలాగే సాక్షాత్తు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు పిఠాపురంలో టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారింది.
కలెక్టర్‌ను దుర్భాషలాడిన కాంట్రాక్టర్
పిఠాపురంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ షాన్ మోహన్‌కు అన్నా క్యాంటీన్ బిల్లుల కోసం ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన కాంట్రాక్టర్ సురవరపు దివానం
పని చేసి ఏడు నెలలైనా బిల్లులు రావడం లేదంటూ కలెక్టర్‌ను… pic.twitter.com/LfzVgrwl3d
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2024