Intinti Ramayanam Today Episode January 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆ నెక్లెస్ ని వేసుకొని మురిసిపోతూ ఉంటుంది. అది చూసిన భానుమతి పార్వతికి చెప్పాలని పార్వతిని తీసుకొని వస్తుంది. అత్తయ్య ఈ నెక్లెస్ ఎలా ఉందని అడుగుతుంది. ఈ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు అని పార్వతి అడుగుతుంది. అయినా నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అత్తయ్య ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది అవని. పార్వతీ మనసులో అక్షయ పై అనుమానం మొదలవుతుంది. శ్రీయను అత్తింటికి పంపాలని వాళ్ళ నాన్న అనుకుంటాడు. ఇక భానుమతి పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ నేక్లెస్ అవని దగ్గరికి ఎలా వెళ్లిందని ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి. కానీ ఆ నెక్లెస్ గురించి భానుమతి అడిగితే నేనేం చెప్పలేను అత్తయ్య నేను ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేను అనేసి అంటుంది. ఇక అక్షయ్ ను అడగటానికి పార్వతి అనుకుంటుంది. పల్లవి తన ప్లాన్ తెలిసిపోతుందని డ్రామాను మొదలు పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి అక్షయ గురించి అడుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ కు ఏదో చెప్పాలని అనుకుంటుంది. అంతలోకే అక్కడికి శ్రీకర్ వాళ్ళ మామ వస్తాడు. రాజేంద్రప్రసాద్ కోపంగా ఆయనతో మాట్లాడతాడు. శ్రీకర్ ఆస్తి ఇవ్వండి అనేసి గట్టిగా అడుగుతాడు. రాజేంద్రప్రసాద్ కోపంతో అతనిపై చిందులేస్తాడు.. నాకు ఒక్కగానొక్క కూతురు కాబట్టి నేను అన్ని క్షమించి ఇంట్లో పెట్టుకున్నాను అంతేకాదు అల్లుని తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకున్నాను కానీ మీరు మీ కొడుకును ఇప్పటికీ క్షమించలేదు అతను చేసిన తప్పేంటి ఈ రోజుల్లో ఎవరు తప్పు చేయట్లేదా అనేసి రాజేంద్రప్రసాద్ ని విశ్వనాథం నిలదీస్తాడు. అసలు వాడు నా కొడుకే కాదు ఇప్పుడు ఏం మాట్లాడతావని రాజేంద్రప్రసాద్ కోపంగా మాట్లాడుతాడు. రాజేంద్రప్రసాద్ మాటలు విన్న విశ్వనాథం ఇంకా రెచ్చిపోతాడు. మీ కొడుకు కాదనుకున్నప్పుడు మీరు అతని ఆస్తిని పని చేసి దులుపుకోవచ్చు కదా అనేసి నిలదీస్తాడు. నేనేం ఊరికే అడగట్లేదు నా అల్లుడు ఆస్తి అతనికి ఇచ్చేసేయండి అతను దారేది అతను చూసుకుంటాడు కదా అనేసి అంటాడు..
ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు అనేసి రాజేంద్రప్రసాద్ రెచ్చిపోతాడు. ఎవరి ఆస్తి ఎవరికి ఇవ్వాలి ఇది నా ఆస్తి నేను సంపాదించుకున్న ఆస్తి నా ఆస్తి నేను ఎవరికీ ఇవ్వను అనేసి గట్టిగా అరుస్తాడు.. నేనేమీ ఊరికే అడగలేదు నా అల్లుడు ఆస్తిని అతనికి ఇవ్వమని అడుగుతున్నాను మీరు ఇంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు నేను ఈ సిటీ లోనే పేరు మోసిన ఒక లాయర్ అయిన సంగతి మీరు మర్చిపోతున్నారు అనేసి అంటాడు. ఎలా తెలుసుకోవాలో ఎక్కడ తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు నేను అక్కడే తేల్చుకుంటాను అనేసి వెళ్ళిపోతాడు.
ఇక అవని శ్రీకర్ కి ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్తుంది. మీ మావయ్య ఇక్కడికి వచ్చి ఆస్తి కావాలని చాలా పెద్ద గొడవ చేశారు నీకు తెలియకుండానే అతను వచ్చి ఆస్తిని అడిగే అంత ధైర్యం అతనికి ఎక్కడ వచ్చింది అనేసి అవని అంటుంది. నాకు నిజంగానే తెలియదు వదిన ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు అసలు ఆయన ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు అనేసి అంటాడు. ఇక అవని ఫోన్ పెట్టేస్తుంది. పార్వతి వచ్చి రాజేంద్రప్రసాద్ తో మాట్లాడాలని దగ్గరకొస్తుంది. ఏంది ఏమైంది అని రాజేంద్రప్రసాద్ గట్టిగా అంటాడు. ఇందాక నువ్వు మాట్లాడాలనుకుంటున్నా మాట ఇదేనా ఆ విశ్వనాథం ఇంటికొస్తాడని నాకు చెప్పాలనుకుంటున్నావా? ఆస్తి గురించి అడుగుతాడని అనాలి అనుకుంటున్నావా అనేసి అడుగుతాడు. ఇంటికి వస్తారన్న విషయం నాకు నిజంగా తెలియదండి అనేసి పార్వతి అంటుంది. మరి దేని గురించి నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు పార్వతి ఏ విషయం గురించి చెప్పాలనుకున్నావని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.
నేను మాట్లాడాలనుకున్న విషయం దయాకర్ గురించి అని అనగానే రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. ఏ దయాకర్ గురించి మాట్లాడాలి అని అడుగుతాడు. అక్షయ్ మేనమామ గురించి అని పార్వతి చెప్పగానే షాక్ అవుతాడు.. దయాకర్ పార్వతి కూడా అసలు నిజం చెప్పేశాడు అని టెన్షన్ పడతాడు. దాంతో రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వస్తుంది. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అటు శ్రీకరుడు వాళ్ళ మామయ్యని అడుగుతాడు. రాజేంద్రప్రసాద్ కి ఏమైందో నాని హాస్పిటల్ లో టెన్షన్ పడుతుంది పార్వతి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..