E-Paper
Advertisement

Unknown people attack on janasena MLA car: రాత్రి జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి

Unknown people attack on janasena MLA car: రాత్రి జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి
Advertisement

Attack on Janasena MLA car(Political news in AP): ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాత్రి జనసేన ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు ఎవరైనా ప్రత్యర్థులున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు జనసేన కార్యకర్తలను వెంటాడుతున్నాయి.

సోమవారం రాత్రి పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు డ్యామేజ్ అయ్యింది. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారని అంటున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

దాడి చేసింది ఎవరు? ఎందుకు దాడి చేశారు? అన్నదానిపై ఆరా తీసే పనిలోపడింది జనసేన పార్టీ. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జనసేన అధినేత, డిప్యూటీ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు వెనుక ఎవరో దాడి చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులున్నారు.

ALSO READ: జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు..

Advertisement

దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని అధికారులు చెప్పుకొచ్చారు.

Related News

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×