BigTV English

Paris Olympics 2024, Day 3 Highlights: పారిస్ ఒలింపిక్స్.. గురి తప్పిన అర్జునుడు

Paris Olympics 2024, Day 3 Highlights: పారిస్ ఒలింపిక్స్.. గురి తప్పిన అర్జునుడు

Arjun babuta in Paris Olympics(Sports news today): పారిస్ ఒలింపిక్స్ లో ఒక పతకం.. చేతికి అందినట్టే అంది చేజారిపోయింది. 10 మీటర ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్ లో అర్జున్ బబుతా 208. 04 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక దశలో రెండో స్థానంలో నిలిచి.. పతకం అందే సమయంలో నాలుగుకి వచ్చేశాడు.


అలాగే షూటింగులోనే మిక్స్ డ్ డబుల్స్ లో క్వాలిఫికేషన్ లో అర్హత సాధించి కాంస్య పోరుకు చేరుకుంది. ఇందులో కూడా మను బాకర్ మరోసారి సత్తా చాటింది. 10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ సరబ్ జోత్ సింగ్ తో కలిసి మూడో స్థానంలో నిలిచింది. చివరికి కాంస్యం బరిలో నిలిచింది.

క్వాలిఫికేషన్ పోరులో టాప్ 4 లో నిలిచిన వారు ఫైనల్ కి అర్హత సాధిస్తారు. ఒకటి రెండు స్థానాల్లో ఉన్నవారి మధ్య స్వర్ణం పోరు నడుస్తుంది. అక్కడ ఓడిన వారికి రజతం వస్తుంది. మూడు నాలుగు స్థానాల్లో ఉన్నవారి మధ్య పోరులో గెలిచిన వారికి కాంస్య పతకం వస్తుంది. ఓడిన వారు ఇంట దారిపడతారు.


ఇక్కడే నేడు రెండు మూడు పతకాలు వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటే, అందులో ఒకటి ఇలా చేజారిపోయింది. మరోవైపు ఒలింపిక్స్ గ్రూప్ దశలో భారత షట్లర్ లక్ష్య సేన్ గెలిచిన మ్యాచ్ ఫలితాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. దానికి కారణం ఏమిటంటే..

Also Read: ‘నాకు కెప్టెన్ గా ఉండాలని లేదు’.. శ్రీలంక మ్యాచ్ విజయం తరువాత సూర్యకుమార్ యాదవ్!

ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ కాంపిటేషన్ నిబంధనల ప్రకారం.. గ్రూప్ దశలో ఇలా ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తే, వాళ్లు ఆడిన, ఆడాల్సిన మ్యాచ్ లను పరిగణలోకి తీసుకోరు. వాటి ఫలితాలను రికార్డుల నుంచి తొలగించారు. దీంతో గ్రూప్ లో మూడు మ్యాచ్ లు ఆడేది లక్ష్య ఒక్కడే. ర్యాంకింగ్స్ ను బట్టి టాప్ లో ఉన్నవారు తర్వాత స్టెప్ చేరుకుంటారు.

అలాగే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత షట్లర్ల ధ్వయం సాత్విక్-చిరాగ్ రెండో మ్యాచ్ కూడా పై విధంగానే రద్దయ్యింది. అవతల ప్రత్యర్థుల జోడి మార్క్-మార్విన్ లో మార్క్ కి గాయమైంది. మూడోరోజు ఆడి ఒకరు, ఆడకుండా ఒకరి మ్యాచ్ లు రద్దయ్యాయి. మరి ఇదేం లెక్కో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గాయపడితే మ్యాచ్ రద్దు చేయడమేమిటి? అంటున్నారు. ఇది ఒకరికి శాపంగా, ఒకరికి వరంగా మారేలా ఉందని, క్రికెట్ లో కూడా వర్షం పడినప్పుడు పెట్టే డక్ వర్త్ లూయిస్ పద్ధతి ఇలాంటిదేనని కామెంట్ చేస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×