E-Paper
Advertisement

పదేళ్ల నిరీక్షణకు తెర.. భారత్‌లోకి ‘యాపిల్ పే’.. మరి యూపీఐకి సపోర్ట్ చేస్తుందా?

పదేళ్ల నిరీక్షణకు తెర.. భారత్‌లోకి ‘యాపిల్ పే’.. మరి యూపీఐకి సపోర్ట్ చేస్తుందా?
Advertisement

Apple Pay India: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన డిజిటల్ పేమెంట్ సర్వీస్ ‘యాపిల్ పే’ (Apple Pay)ను భారత్ లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన పదేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఈ సర్వీస్ కోసం ఐఫోన్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తొలి దశలో యూపీఐ (UPI) సేవలు ఇందులో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

యూపీఐ సేవలు ఉండవు!

ప్రారంభంలో యాపిల్ పే ద్వారా యూపీఐ లావాదేవీలు జరిపే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. యాపిల్ పే‌లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టాలంటే ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (NPCI) అనుమతితో పాటు ఒక బ్యాంక్ పార్ట్‌నర్ స్పాన్సర్‌షిప్ తప్పనిసరి. ఈ ప్రక్రియ కాస్త సంక్లిష్టంగా ఉండటంతో యాపిల్ సంస్థ ప్రారంభంలో క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపులపైనే దృష్టి పెట్టాలని భావిస్తోంది. కాబట్టి గూగుల్ పే, ఫోన్ పే తరహాలో యూపీఐ పేమెంట్లకు యాపిల్ పే వెంటనే ప్రత్యామ్నాయంగా మారకపోవచ్చు.

క్రెడిట్ కార్డ్‌తో ట్యాప్ అండ్ పే!

Advertisement

ఇక తొలి దశలో యాపిల్ పే పూర్తిగా క్రెడిట్ కార్డుల చుట్టూనే తిరగనుంది. దీనికోసం యాపిల్ ఇప్పటికే వీసా, మాస్టర్‌కార్డ్ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లతో పాటు భారత్‌లోని క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. యూజర్లు తమ క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్ లో యాడ్ చేసుకోవచ్చు. అనంతరం ఎన్‌ఎఫ్‌సీ (NFC) సపోర్ట్ చేసే పాయింట్ ఆఫ్ సేల్ (PoS) మెషీన్ల వద్ద ఐఫోన్‌తో నేరుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు. అంటే ఇకపై ఫిజికల్ క్రెడిట్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఐఫోన్‌తో ఆథెంటికేట్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చన్నమాట.

Also Read: Airtel యూజర్లకు షాక్.. రూ. 579, రూ. 859 ప్లాన్లు గుప్‌చుప్‌గా అవుట్.. ప్రత్యామ్నాయాలు ఇవే!

ఛార్జీలపై రాని స్పష్టత

Advertisement

యాపిల్ పే భారత్‌లో అడుగుపెట్టడానికి ప్రధాన అడ్డంకిగా మారిన అంశం ‘ఛార్జీలు’. నివేదికల ప్రకారం.. ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీపై 15 నుండి 20 బేసిస్ పాయింట్ల మేర వాటా కావాలని యాపిల్ డిమాండ్ చేస్తోంది. కానీ కొన్ని ప్రముఖ బ్యాంకులు మాత్రం దీన్ని 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయాలని కోరుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ రుసుమును నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయరు. కార్డు లావాదేవీల ద్వారా బ్యాంకులు సంపాదించే రాబడి నుంచే యాపిల్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై లోకేశ్ ఫొటో.. రూ.కోటి ఖర్చు చేశారా? ఫ్యాక్ట్ చెక్‌లో తేలిందిదే!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×