E-Paper
Advertisement

రాజకీయాల్లో ఎదిగిన రౌడీ… గెలిచిన రాత్రే హత్య.. అసలు చంపిందెవరు?

రాజకీయాల్లో ఎదిగిన రౌడీ… గెలిచిన రాత్రే హత్య.. అసలు చంపిందెవరు?
Advertisement

Telugu Crime Thriller on OTT:  కాకినాడ రాజకీయాల నేపథ్యంలో రౌడీయిజం, అధికారం, వెన్నుపోటు, హత్య మిస్టరీలను కలిపి తెరకెక్కించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ (Gedela Raju Kakinada Taluka 2026). థియేటర్లలో విడుదలైన కొన్ని నెలల తర్వాత, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రాజకీయాల చుట్టూ జరిగే నేరాలు, ఒక హత్య వెనుక దాగి ఉన్న అసలు కారణాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే కథలను ఇష్టపడేవారు, థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కాకినాడ నగరంలో రౌడీయిజం చేస్తూ జీవించే గేదెల రాజు అనే వ్యక్తి ఈ కథలో ప్రధాన పాత్ర. రౌడీ షీటర్‌గా ఉన్న అతని జీవితం అనూహ్యంగా రాజకీయాల వైపు మలుపు తిరుగుతుంది. అధికార పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ సాధిస్తాడు. రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ముందుకు సాగుతాడు.

Advertisement

ఎన్నికల ప్రచారం, రాజకీయ ఎత్తులు పైఎత్తుల మధ్య గేదెల రాజు విజయం దాదాపు ఖాయమైందనే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడే కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. రాజకీయంగా తనకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడి, గెలుపు ముంగిట నిలిచిన అదే రాత్రి గేదెల రాజు దారుణంగా హత్యకు గురవుతాడు.

ఒక రౌడీ షీటర్ రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సమయంలోనే హత్యకు గురికావడంతో కాకినాడ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. హత్య అనుకుని దర్యాప్తు స్టార్ట్ చేస్తారు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ అనేక అనుమానాలకు దారి తీస్తుంది.

Advertisement

గేదెల రాజుకు సంబంధం ఉన్న ఏడుగురు ప్రధాన వ్యక్తులు పోలీసుల అనుమానితుల జాబితాలోకి వస్తారు. వీరిలో ప్రతి ఒక్కరికీ గేదెల రాజుతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత విభేదాలు, అధికారం కోసం వేసిన ఎత్తులు, పాత గొడవలు.. ఇలా ఒక్కో కోణం బయటపడే కొద్దీ కేసు మరింత సంక్లిష్టంగా మారుతుంది.

అయితే ఆ ఏడుగురిలో నిజంగా గేదెల రాజును చంపింది ఎవరు ? ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్ష ఉందా ? రాజకీయ కారణాలున్నాయా? గేదెల రాజు రాజకీయంగా ఎదగడం ఎవరికైనా ప్రమాదంగా మారిందా ? పోలీసులు ఒక్కో అనుమానితుడిని విచారిస్తూ అసలు నిజాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారు ? అనేదే సినిమాలోని ప్రధాన సస్పెన్స్.

తెలుగు సినిమానే…

ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే… హత్య జరిగిన తర్వాత మొదలయ్యే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కు కథలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరిని అనుమానిస్తూ, వారి మధ్య ఉన్న సంబంధాలను బయటకు తీస్తూ హంతకుడి వరకు వెళ్లే విధానం క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది. గేదెల రాజు పాత్రలో నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కనిపించారు. వికాస్ ముప్పాల, శ్రీకాంత్ అయ్యంగార్, రవి ఆనంద్ చిన్నిబిల్లి, టీనా శ్రావ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్య మోటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మోటూరి టాకీస్ బ్యానర్‌పై వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు.

‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ ప్రస్తుతం Aha, Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ డ్రామా, మర్డర్ మిస్టరీ వంటి అంశాలు ఉన్న సినిమాను చూడాలంటే వీకెండ్ వాచ్‌గా ట్రై చేయొచ్చు. మరి రాజకీయంగా ఎదుగుతున్న గేదెల రాజుకు శత్రువు ఎవరు? అతని చుట్టూ తిరిగిన ఆ ఏడుగురిలో అసలు హంతకుడు ఎవరు? ఆ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారో తెలుసుకోవాలంటే దీన్ని చూడాల్సిందే.

Read Also: అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×