BigTV English

Crime News: అప్పు ఇచ్చాడు.. ఏకంగా భార్యను పంపమన్నాడు.. కట్ చేస్తే..?

Crime News: అప్పు ఇచ్చాడు.. ఏకంగా భార్యను పంపమన్నాడు.. కట్ చేస్తే..?

AP Crime News: వారిద్దరూ స్నేహితులు. కలిసి తిరిగారు. ఫ్రెండ్ అంటే నువ్వేరా అనుకునేలా ఉండేవారు. కానీ జస్ట్ ఒక్క ఘటన వారిలో ఒకరిని లోకం నుండే లేకుండా చేసింది. మరొకరిని కటకటాల పాలు చేసింది. ఇంతకు ఆ ఫ్రెండ్షిప్ మధ్య ఏమి జరిగింది ? తీరని లోకాలకు ఆ ఫ్రెండ్ వెళ్లేందుకు కారకుడు ఇతనే ఎందుకయ్యాడు ? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు ఏపీలోని తెనాలిలో.


తెనాలి అంటేనే శాంతియుత వాతావరణానికి పేరుగాంచిన నగరంగా పేరు. ఈ నగరాన్ని ఆంధ్ర ముంబాయి అని కూడా అంటారు. అలాంటి నగరంలో ఈ నెల 2వ తేదీన రహదారి ప్రక్కన ఓ మృతదేహం, స్థానికుల కంటపడింది. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ పోలీసులు ఘటనా స్థలి వద్దకు ఎంటరయ్యారు. మృతదేహం చూస్తే హత్య గావించబడినట్లే ఉంది.. అసలు ఎవరు ఈ హతుడంటూ..  పోలీసులు వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అసలు కథ తెలుసుకొనే పనిలో పడ్డ పోలీసులకు షాకిచ్చే విషయాలను తెలుసుకున్నారు. నిందితుడిని అతి తక్కువ కాలవ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. పోలీసుల పనితీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకు అసలేం జరిగిందంటే…
తెనాలికి చెందిన బౌన్సర్ కోటేశ్వరరావు , షఫీ లు మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి తిరిగేవారు. అయితే అత్యవసర ఖర్చుల నిమిత్తం కోటేశ్వరరావు వద్ద షఫీ రూ. 10 వేలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్నాడే కానీ తిరిగి చెల్లించలేదు షఫీ. ఇక చూశాడు కోటేశ్వరరావు.. రోజూ డబ్బులు ఇవ్వాలని అడిగేవాడు. అది కూడా రాత్రి వేళల్లో ఫోన్ చేయడం డబ్బులు ఇస్తావా లేదా.. లేకుంటే నీ భార్యను నా దగ్గరికి పంపించేయ్ అంటూ కోటేశ్వరరావు దుర్భాషలాడాడు.


Also Read: CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో బాబు.. కేంద్రం ప్రకటనతో షాక్.. ఇక మంచిరోజులు వచ్చినట్లే..

ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న షఫీ ఈనెల 1వ తేదీన మందు త్రాగుదాం రమ్మంటూ కోటేశ్వరరావు కి ఫోన్ చేశాడు. ఇక ఆ మాట విన్న వెంటనే తను కూడా బుర్రిపాలెం వద్ద గల ఖాళీ ప్రదేశానికి చేరుకొని మందు త్రాగాడు. ఇక తన భార్యను పంపమని కోరిన కోటేశ్వరరావును తాను తెచ్చుకున్న కత్తితో షఫీ పొడిచి హత్య చేశాడు. ఇక అంతే కోటేశ్వరరావు అక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే ట్రైనీ డిఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాసరావు, ఎస్సై ప్రతాప్ లు ముమ్మర దర్యాప్తు నిర్వహించి, నిందితుడు షఫీని అరెస్ట్ చేశారు. ఒక అప్పుతో మొదలైన వీరి స్నేహబంధం వివాదం.. చివరికి ఒక మిత్రుడి చావు వరకు తీసుకెళ్ళింది. మరొక మిత్రుడిని కటకటాల పాలు చేసింది.

Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×