BigTV English

Posani krishna Murali: అన్ని కేసుల్లో పోసాని కృష్ణ మురళికి బెయిల్.. విడుదలకు బ్రేక్..

Posani krishna Murali: అన్ని కేసుల్లో పోసాని కృష్ణ మురళికి బెయిల్.. విడుదలకు బ్రేక్..

Posani krishna Murali: పోసాని కృష్ణమురళీని సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో.. ఆయన విడుదల అవుతారని అంతా అనుకున్నారు. కానీ, ఐదు నెలల క్రితం నమోదైన సీఐడీ కేసులో ఆయనకు చిక్కులు తప్పేలా లేవు. గుంటూరు సీఐడీ పోలీసులు.. పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించింది.


వైసీపీలో పనిచేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సీఐడీ కేసులో కర్నూలు జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీఐడీ అధికారులు వేసిన పీటీ వారెంట్‌తో.. కర్నూలు జైలు నుంచి పోసానిని వర్చువల్‌గా విచారణకు హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో.. కర్నూల్ నుంచి గుంటూరు జైలుకు ఆయన్ను సీఐడీ అధికారులు తరలిస్తున్నారు.

మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నరసరావు పేట టూటౌన్ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టురో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మార్చి 3న అన్నమయ్యజిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని నరసరావుపేటకు తీసుకొచ్చిన పోలీసులు స్థానికి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్‌ దాఖలు చేశారు.


కాగా అదోనీ త్రీటౌన్ పీఎస్ లో నమోదైన కేసును కర్నూలు కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ పై ఐదురోజులుగా వాదనలు జరిగాయి. కర్నూలు సబ్ జెయిల్ నుండి విడుదల అనంతరం భవానీ పురం కేసులో మరోసారి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓబులవారి పల్లి నరసరావుపేట అదోనీ కేసుల్లో బెయిల్ మంజూరు అయ్యాయి.

మంగళవారం ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా, సోమవారం నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ వచ్చినట్టు అయ్యింది. తాజాగా సీఐడీ పోలీసుల పీటి వారెంట్‌తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.

అయితే పోసానిపై పెట్టిన మొత్తం 17 కేసుల్లో మిగతా వాటిల్లో బీఎన్ఎస్ చట్టం 35(3) కింద నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మహా శివరాత్రి రోజు హైదరాబాద్‌లో పోసానిని అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కాగా వైసీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై వ్యక్తిగత విమర్శలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కూటమి పార్టీల కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. తొలుత అన్నమయ్య జిల్లా పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు కావడంతో సతమతమయ్యారు.

Also Read: టీడీపీ దర్శనాల ఇష్యూ.. సీఎం చంద్రబాబుకు మంత్రి లేఖ

ఒక్కో కేసులో పీటీ వారెంట్‌ కోరుతూ పోసానిని వందలకొద్దీ కిలోమీటర్లు పోలీసులు తిప్పారని వైసీపీ ఆరోపించింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు ఆ తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, తర్వత గుంటూరుకు, అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు తిప్పారని వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అపై అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించి, అయితే 67 ఏళ్ల వయసులో, హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న పోసానిని అనారోగ్య సమస్యలున్నా సరే ప్రభుత్వం వేధించిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

అయితే పోసానికి వైసీపీ లీగల్ సెల్ అండగా నిలబడి హైకోర్టుకు నివేదించి సమర్థవంతంగా వాదనలు వినిపించింది. దీంతో పోసానిపై నమోదైన కేసులో 35(3) నోటీసు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం వన్‌ టౌన్‌లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలివ్వడంతో పోసాని ఊపిరిపీల్చుకున్నారు. కృష్ణమురళికి హైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను వైసీపీ లీగల్‌ సెల్‌ ఆశ్రయించింది. పోసానికి పూర్తిగా వైసీపీ అండగా ఉందని చెప్పుకోవచ్చు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×