Posani Krishnamurali: ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు, వైసీపీ మద్ధతుదారుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు.
ఇప్పటికే పోసానిపై పలు కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. పోసానిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. ఆయనపై 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2), BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లిలో పీఎస్ లో పోసానిపై పోలీసులు కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయనను అనంతపురం జిల్లాకు తీసుకుళ్తున్నారు. గతంలో పోసాని కృష్ణ మురళి వైసీపీలో పని చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోసానిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.65,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..
అయితే, పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసుల తీరు ఏమాత్రం బాగోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.