AP Politics: ఏపీలో నేతల వలసలు కంటిన్యూ అవుతున్నాయా? విపక్ష వైసీపీ నుంచి నేతలు వలస బాటపడుతున్నారా? వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత అడుగులు ఎటు వైపు? బీజేపీ వైపు వెళ్తున్నారా? జేడీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయి కండువా కప్పుకోనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకోవాలని భావిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి చాలామంది నేతలు దూరంగా ఉన్నారు. ఇక ఆ పార్టీలో భవిష్యత్ ఉందని నిర్ణయించుకున్న కొందరు నేతలు ఆ పార్టీకి రాం రాం చెప్పేశారు. ఇంకొందరు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పోతుల సునీత, ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లారు.
ఆదివారం విశాఖలో జరగనున్న సభలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో సునీత బీజేపీ కండువాను కప్పుకోనున్నారు. బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆమె జాయిన్ అవుతున్నట్లు చెబుతున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే పోతుల సునీత ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సీటు రాజీనామా వ్యవహారం ఛైర్మన్ మోషేన్‌రాజు వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయన ఇంకా ఆమోదించాల్సివుంది. ఈ క్రమంలో ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు.
ALSO READ: తురకపాలెం సాయిల్ టెస్టింగ్ లో సంచలన నిజాలు
2017లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సునీత. 2019లో చీరాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆమెకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సునీత. వైసీపీ అధికారంలో కోల్పోగానే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
చీరాల నుంచి టీడీపీ, జనసేన నుంచి బలమైన నాయకులు ఉండడంతో బీజేపీ అయితే బెటరని భావించి జాయిన్ అయినట్టు చెబుతున్నారు. ఆమె బీజేపీలోకి వెళ్లడం వెనుక జగన్ ఉన్నారనే వాదన సైతం లేకపోలేదు. జగన్ సూచనల మేరకు ఆమె వెళ్తున్నారని అంటున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసిన తర్వాత ఆ పార్టీపై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. మొత్తానికి పోతుల సునీత గురించి రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
బీజేపీలో చేరిన పోతుల సునీత దంపతులు
విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిన సునీత దంపతులు
ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి సునీత రాజీనామా pic.twitter.com/jQRhKZXl1p
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025