E-Paper
Advertisement

YSRCP : పబ్లిక్ టాక్.. న’బూతు’ న వైసీపీ!

YSRCP : పబ్లిక్ టాక్.. న’బూతు’ న వైసీపీ!
Advertisement

ఏపీ రాజకీయాల్లో బూతుల ట్రెండ్ నడుస్తోంది. ఎవరు ఎక్కువగా మాట్లాడితే వారిదే రాజ్యం అన్న విధంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. జనాలు మమ్మల్ని అసహ్యించుకుంటున్నారనే కనీస ఆలోచన కూడా చేయడం లేదని తెలుస్తున్నది. 2019లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ కేవలం పాలనా బాధ్యతలు చూసుకున్నారు. ఆయన ఎక్కువగా ఏం మాట్లాడలేదు. కేవలం సంక్షేమం, స్కీమ్స్ మీదే ఫోకస్ పెట్టారు. ఇక పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. అందులో ఒకరిద్దరూ నేతలు మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారి పేర్లను జనాలు నేటికీ మర్చిపోలేకపోతున్నారు.

తిట్టినోళ్లకే పదవులు..

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తనను జైలుకు పంపించారనే కక్ష పెంచుకున్నారని టాక్. ఆ తర్వాత ఆయన అధికారంలోకి రాగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని తన పార్టీ నేతలను ముందు పెట్టి రాజకీయం చేయించారని ఇప్పటికీ పలుమార్లు చర్చించుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంలో తొలి టర్ములో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకంటే ఆయన మీడియా ముందు ఎక్కువగా కనిపించేవారు. మాస్ లీడర్‌గా ఆయనకు పేరుంది. ఇంకేముంది ఆయన ద్వారానే జగన్ తన బూతు రాజకీయాన్ని ప్రోత్సహించారని, వెన్ను తడుతూ చంద్రబాబు కుటుంబంపై విమర్శలు, బూతులు తిట్టించారని గతంలో ప్రచారం జరిగింది.
రాజకీయ విమర్శలు ఎవరైనా చేస్తారు? కానీ వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో ఆక్షేపనీయం కదా? దీనిపై ఎందుకు ప్రశ్నించకూడదని జనాలు సైతం విమర్శించిన రోజులున్నాయి.

రైతులను అడ్డంపెట్టుకుని మరీ..

Advertisement

జగన్ ప్రభుత్వంలో అమరావతి రాజధాని రైతులు దాదాపు రెండేళ్ల పాటు రాజధాని మార్చొద్దని పోరాటం చేశారు. పెద్దఎత్తున నిరసనలు సైతం చేశారు. అయితే, జగన్ అండ్ కో బ్యాచ్ వారిని చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించింది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు కావాలనే రైతులను అడ్డం మరీ చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. మాటలకు అందని పదాలు వాడారు. దీనికి తోడు ఏకంగా అసెంబ్లీలో వైసీపీ వైఫల్యాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న టైంలోనూ వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. నారాలోకేశ్ వ్యక్తిత్వం, మంగళగిరి నుంచి ఓడిపోయారని గుర్తుచేస్తూ అసలు చంద్రబాబు తనయుడేనా? అంటూ నోటికొచ్చినట్టు వాగారు. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఆయన పుట్టుకను శంకించారు.

Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ వేటు? సర్పంచ్ ఎన్నికల పరిస్థితులు దృష్ట్యా పార్టీ ముందుగానే అలర్ట్ !

Advertisement

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సైతం చంద్రబాబు, నారా లోకేశ్‌ను పలు సందర్భాల్లో వాడు వీడు అని మాట్లాడిన రోజులున్నాయి. వైసీపీ రాజకీయాలే ‘న బూతో న వైసీపీ’ అనే విధంగా ఉన్నాయని ఏపీ ప్రజలు సైతం చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. నేటికి ఈ విషయంపై ఎవరిరైనా ప్రశ్నిస్తే ఇప్పటికీ వారు ఆ విషయాలను గుర్తుచేయకమానరు. అసలు వైసీపీలో ఉన్న వారంతా ప్రజాసేవకులా? లేదా రౌడీలా? అన్నట్టు వ్యవహరిస్తారని పెద్దఎత్తున ప్రజలు చర్చించుకున్న రోజులున్నాయి. అధికారం కోల్పోయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని.. తాజాగా అంబటి రాంబాబు మాట్లాడిన దాన్ని ఈ సందర్భంగా జనాలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు గౌరవం ఇవ్వకపోయినా.. ఆయన హోదాకు అయినా ఇవ్వాలి కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.అసలు వీరు రాజకీయాలకు పనికిరారు అనే వారు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×