Travis Head: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో… నాలుగు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి సెమీ ఫైనల్ లో ( Champions Trophy 2025 Tournament Semis ) టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య బిగ్ ఫైట్ ఉంది. అలాగే రెండవ సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ( South Africa vs New Zealand ) మధ్య ఫైట్ ఉంటుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ రేపు అంటే మార్చి 4వ తేదీన జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు… దుబాయ్ లో ప్రారంభమవుతుంది.
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇప్పటికే ఈ స్టేడియంలో వరుసగా గ్రూప్ స్టేజీలో మూడు మ్యాచ్ లు గెలిచింది టీమిండియా. దీంతో పాయింట్ల పట్టికలో… మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అంత బాగానే… ఉంది. తాజాగా టీమిండియా కు కొత్త టెన్షన్ నెలకొంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడటం. అందులోనూ ఆస్ట్రేలియన్ డేంజర్ ఆటగాడు… ట్రావిస్ హెడ్ ( Travis Head).. బ్యాటింగ్ అంటేనే టీమిండియా వనికి పోతుంది. అటు టీమిండియాతో… మ్యాచ్ అంటేనే రెచ్చిపోతాడు ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ ( Travis Head). మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్… ఇండియాకు నరకం చూపించాడు అని చెప్పవచ్చు. అప్పట్లో ఇండియా పైన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు హేడెన్ భయంకరంగా ఆడేవాడు.
ఇక ఇప్పుడు… హెడ్ అలాగే తయారయ్యాడు. ఇండియా మ్యాచ్ అంటే చాలు.. పడుకుని సిక్స్ లు, ఫోర్లు కొట్టేయగలడు. ఈ తరుణంలోనే టీమ్ ఇండియా అభిమానులు కాస్త భయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో హెడ్ వికెట్ ఒకటి తీస్తే.. చాలు… మనదే గెలుపు అంటున్నారు. కానీ హెడ్ ను కొంచెం లైట్ తీసుకున్న… మ్యాచ్ రూపాన్ని మార్చగల… కుంభకర్ణుడు అంటూ హెడ్ ను చూసి వనికి పోతున్నారు టీమ్ ఇండియా అభిమానులు. కాబట్టి హెడ్ ను అవుట్ చేసేందుకు…. టీమిండియా కొత్త ప్లాన్లు వేయాలని కోరుతున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించి… హెడ్ వికెట్ తీయాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. మరి రేపటి సెమీఫైనల్ లో హెడ్ విషయంలో టీమిండియా ఎలాంటి అడుగులు… వేస్తుందో చూడాలి.
Also Read: Hardik Pandya: కుంగ్ ఫూ పాండ్యా….. కేన్ మామకు వెన్నులో వణుకు పుట్టించాడు?
ఇండియాపై ట్రావిస్ హెడ్ రికార్డులు
ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head) ఇండియా పైన వన్డేలలో.. మంచి రికార్డు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా పైన 9 వన్డే మ్యాచ్ లలో ఆడాడు ట్రావిస్ హెడ్. ఇందులో 43.12 యావరేజ్ తో.. 100 కు పైగా స్ట్రైక్ రేట్ సంపాదించాడు. అలాగే ఒక సెంచరీ తో పాటు హాఫ్ సెంచరీ కూడా చేశాడు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 137 పరుగులుగా ఉంది. మొత్తం తొమ్మిది మ్యాచ్లో 345 పరుగులు చేశాడు ట్రావిస్ హెడ్.
Aray yaar kya kya bana rahe log..😭😭
Travis Head and Rohit Sharma 🤣 pic.twitter.com/nmLNJHcQTY— 🇮🇳Rohit🇮🇳 (@Rohit_p__) March 2, 2025