E-Paper
Advertisement

Punarvika Sri Health Issue: ఒక్క ఇంజక్షన్ రూ 16 కోట్లు.. ఈ చిన్ని ప్రాణం కోసం దేశమే కదిలింది!

Punarvika Sri Health Issue: ఒక్క ఇంజక్షన్ రూ 16 కోట్లు..  ఈ చిన్ని ప్రాణం కోసం దేశమే కదిలింది!
Advertisement

Punarvika Sri Health Issue: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి (ఏలూరు) జిల్లా తాడేప‌ల్లి గూడేంకు చెందిన‌ చిన్నారి పునర్విక శ్రీ ఎదుర్కొంటున్న ప్రాణాంతక పరిస్థితి ప్రస్తుతం అందరినీ కలిచివేస్తోంది. ఈ చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడతాయి. నడవడం.. కూర్చోవడం వంటి సాధారణ కదలికలతో పాటు శ్వాస తీసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. పునర్విక శ్రీ ప్రస్తుతం ఇటువంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ వ్యాధికి చికిత్సగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందుగా పేరుగాంచిన ‘జోల్గెన్స్మా’ (Zolgensma) అనే ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు.

ఈ చికిత్సకు అయ్యే ఖర్చు వింటే ఎవరికైనా గుండె ఆగుతుంది. చిన్నారి ప్రాణాలను నిలపడానికి కావాల్సిన ఆ ఒక్క ఇంజెక్షన్ ధర సుమారు 16 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం సామాన్యులైన ఆ తల్లిదండ్రుల శక్తికి మించిన పని. ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మినా.. బంధుమిత్రుల సహాయం తీసుకున్నా ఈ నిధిలో కొంత భాగం కూడా పూర్తికాదు. మరోవైపు ఈ మందును పాపకు రెండు సంవత్సరాల వయస్సు లోపు మాత్రమే అందించాల్సి ఉంటుంది. అప్పుడే అది శరీరంలో సమర్థవంతంగా పనిచేసి ప్రాణాలను కాపాడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

సమయం తక్కువగా ఉండటం.. ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కళ్లముందే పసిపాప పడుతున్న బాధను చూడలేక.. దాతలు.. స్వచ్ఛంద సంస్థలు.. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వేదికగా ఈ చిన్నారికి సహాయం చేయాలని ప్రచారం మొదలుపెట్టారు. దాతల ప్రతి రూపాయి పునర్విక శ్రీ ప్రాణాలను నిలిపేందుకు ఒక ఆశగా మారుతుంది. ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఖరీదైన మందుపై పన్ను మినహాయింపులు లేదా ఆర్థిక సహాయం అందించి చిన్నారిని రక్షించాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Read Also: Wedding Violence: పెళ్లి వేడుకలో చిచ్చుపెట్టిన శునకం.. కర్రలు, కుర్చీలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు!

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×