Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి సంజు శాంసన్ ( Sanju Samson )… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సంజూ శాంసన్ వేలికి గాయం కావడంతో… దాదాపు రెండు నెలల పాటు అతనికి రెస్టు కావాలని డాక్టర్లు సూచించినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
Also Read: Rajeev shukla: అందరి షర్ట్స్ విప్పి తిరగమన్నాడు.. గంగూలీపై రాజీవ్ శుక్లా సంచలనం!
ఒకవేళ అదే నిజం అయితే…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి సంజు శాంసన్ ( Sanju Samson ) దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రోజున ఐదవ టి20 జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిట్ట చివరి t20 మ్యాచ్ లో దాదాపు 150 పరుగుల తేడాతో ఇంగ్లాండును చిత్తు చేసింది టీమిండియా. చివరి మ్యాచ్ లో కూడా… సంజు శాంసన్ ( Sanju Samson ) దారుణంగా విఫలమయ్యాడు. రెండు సిక్స్లు అయితే బాదాడు కానీ…. తొందరగానే అవుటయ్యాడు.
అయితే ఈ మ్యాచ్ లో… ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్… కారణంగా గాయపడ్డాడు సంజు శాంసన్. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సంజు శాంసన్ ( Sanju Samson ) వేలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో మ్యాచ్ కాసేపు ఆపేసారు కూడా. అయినప్పటికీ… చిన్నపాటి ప్రథమ చికిత్స చేసుకున్న సంజు శాంసన్ ( Sanju Samson ) మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అయితే అదే వేలిగాయం తీవ్రతరం అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు సంజు శాంసన్ ( Sanju Samson ) కు రెస్ట్ ఇవ్వాలట. అలాగే అతని వేలుకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించినట్లు చెబుతున్నారు. ఒకవేళ సంజు శాంసన్ ( Sanju Samson ) వేలుకు ఆపరేషన్ చేస్తే… కచ్చితంగా రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి దూరం కాబోతున్నాడని… సంజు శాంసన్ పై కొత్త వార్త ప్రచారం జరుగుతోంది.
Also Read: Yuvraj Singh: అదిరిపోయే శుభవార్త చెప్పిన యూవీ..రీ-ఎంట్రీపై ప్రకటన!
ఒకవేళ… ఐపీఎల్ టోర్నమెంట్ కు సంజు శాంసన్ ( Sanju Samson ) దూరం అయితే…. కెప్టెన్సీ బాధ్యతలు యశస్వి జైష్వాల్ కు ( Yashasvi Jaiswal ) ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టులో యంగెస్ట్ అలాగే డేంజర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) కావడంతో…. అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ మొన్నటి మెగా వేలం సమయంలో యశస్వి జైస్వాల్ ను 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఓపెన్ అరుగా అద్భుతంగా రాణించిన నేపథ్యంలో అతని రిటైన్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్.