BigTV English

Lady Aghori: లేడీ అఘోరీకి పోలీస్ ట్రీట్మెంట్.. ఏకంగా కారుతో సహా గాల్లోకెత్తి అదుపులోకి..

Lady Aghori: లేడీ అఘోరీకి పోలీస్ ట్రీట్మెంట్.. ఏకంగా కారుతో సహా గాల్లోకెత్తి అదుపులోకి..

Lady Aghori: లేడీ అఘోరీకి బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేకులు వేసింది ఎవరో కాదు తెలంగాణ పోలీస్. గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీని కట్టడి చేయాలని పలువురు భక్తులు కోరుతున్న నేపథ్యంలో పోలీసులు రియాక్షన్ గట్టిగానే తీసుకున్నారు. ఇటీవల పలు ఆలయాల సందర్శనకు వెళ్ళిన సమయంలో అఘోరీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో గల దర్గాను కూల్చివేస్తానంటూ లేడీ అఘోరీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా అదేపనిగా వెళుతున్న క్రమంలో అఘోరీకి పోలీసులు బ్రేక్ వేశారు.


లేడీ అఘోరీ అంటేనే పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా ఈమెపై సాగిన ప్రచారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి సమయంలో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ, సనాతనధర్మ పరిరక్షణ తన భాద్యత అంటూ ప్రకటించారు ఆ సమయంలో. అలా తెలంగాణలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే పలు ఛానల్స్ కి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అంతవరకు ఓకే ఈ లేడీ అఘోరీ వస్త్రధారణ పాటించక పోవడంతో, పలు చోట్ల వివాదాలు సైతం సాగాయి.

తెలంగాణకు చెందిన లేడీ అఘోరీ.. వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా కొమురవెల్లి ఆలయానికి వెళ్ళిన సమయంలో అఘోరీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా చేతులు కత్తి పట్టుకొని పలువురు భక్తులపై దాడికి సైతం యత్నించారు. అంతేకాదు స్థానిక మీడియా ప్రతినిధి మొబైల్ ఫోన్ లాక్కొని విసిరి వేసిన ఘటనలపై పోలీసులు ఇప్పటికే అఘోరీపై నాలుగు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.


అంతేకాదు వరంగల్ జిల్లాలో సైతం లేడీ అఘోరీ పై కోడిని బలిచ్చినట్లుగా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేజీ ద్వారా.. వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానంటూ అఘూరి పలుమార్లు ప్రకటనలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం లేడీ అఘోరీ వేములవాడ వైపు వెళ్తుండగా.. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అఘోరీీని అడ్డుకున్నారు.

Also Read: Rahul Gandhi: తెలంగాణలో సక్సెస్.. దేశవ్యాప్తంగా సర్వే సాగించలేరా? రాహుల్ గాంధీ ప్రశ్న

తిరిగి వెనక్కు వెళ్లాలని పోలీసులు ఆదేశించడంతో, అఘోరీ ససేమిరా అంటూ అక్కడే కూర్చున్నారు. దీనితో స్థానిక ప్రజలు భారీగా తరలిరాగా, ఉచిత వాతావరణం ఏర్పడింది. ఎట్టకేలకు అఘోరీని తంగళ్ళపల్లి, సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంత వేడుకున్నా.. అఘోరీ మాట వినకపోవడంతో టోయింగ్ వ్యాన్ తో కారును బంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అఘోరీ మొబైల్ ఫోన్ తో మొత్తం రికార్డ్ చేయడం విశేషం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అన్నది.. తెలియాల్సి ఉంది.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×