BigTV English

Actress Laya Latest Interview: విడాకులు అయ్యి.. అడుక్కు తింటున్నా.. రీఎంట్రీపై లయ వ్యాఖ్యలు

Actress Laya Latest Interview: విడాకులు అయ్యి.. అడుక్కు తింటున్నా.. రీఎంట్రీపై లయ వ్యాఖ్యలు

Actress Laya Re-entry in Tollywood Movies: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ లయ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ తరువాత తెలుగులో ఎన్నో మంచి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడాలేకుండా అణా నటనతో అభిమానులను కట్టిపడేసింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిపోయింది. అక్కడ తనకంటూ ఒక డ్యాన్స్ స్కూల్ ను స్టార్ట్ చేసి లైఫ్ లీడ్ చేస్తుంది.


ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చాకా ఏ దేశంలో ఉన్నా కూడా అభిమానులకు దగ్గరకావచ్చు అని తెలుసుకున్న లయ. తన డ్యాన్స్ తో మళ్లీ ఫ్యాన్స్ కు దగ్గరయ్యింది. ప్రస్తుతం లయ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లయ ఇండియాకు వచ్చింది. వచ్చిరాగానే వరుసగా ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెటింది. ఇక ఒక ఇంటర్వ్యూలో తన రీఎంట్రీ విషయాల గురించి, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ న్యూస్ గురించి మాట్లాడింది.

Also Read: Tomorrow OTT Movies: రేపు ఓటీటీలో సినిమాల జాతర.. టిల్లు స్క్వేర్‌తో సహా మరికొన్ని సినిమాలు..


“సోషల్ మీడియాలో నా గురించి ఎప్పుడు అంత ఎక్కువ గాసిప్స్ రాలేదు. హీరోయిన్లు చాలాకాలం తరువాత రీఎంట్రీ ఇస్తున్నారు అంటే.. విడాకులు అయ్యి, భర్తను వదిలేసాక అడుక్కుతింటూ ఉండడం వలన మళ్లీ సినిమాలు చేస్తున్నారు అని అనుకుంటారు. నేనేం అడుక్కుతినడం లేదు.. నాకేమి విడాకులు కాలేదు. అప్పుడంటే పిల్లలు చిన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్లు పెద్దవారు అయ్యారు. వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలను, నా భర్తను పర్మిషన్ అడిగి నేను నటించడానికి వచ్చాను. అడుక్కుతినే గతి నాకు లేదు” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×