BigTV English

SI On Jagan: ఊడదీయడానికి అరటి తొక్క కాదు.. జగన్‌కు ఎస్ఐ వార్నింగ్

SI On Jagan: ఊడదీయడానికి అరటి తొక్క కాదు.. జగన్‌కు ఎస్ఐ వార్నింగ్

SI On Jagan: వైసీపీ అధినేత జగన్ స్కెచ్‌లు బూమరాంగ్ అవుతున్నాయా? ఆయన పర్యటించిన ప్రాంతాల్లో పోలీసుల శాఖపై ఎందుకు విరుచుకుపడుతున్నారు? పోలీసులను ఆయన బెదిరిస్తున్నారా? వారిని రెండు వర్గాలుగా చీల్చాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ విషయంలో జగన్ ఆలోచనలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం వెనుక ఏం జరుగుతోంది?


వైసీపీ ప్లాన్ బూమరాంగ్

విభజించి పాలించడం కొందరు రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. గడిచిన ఐదేళ్లు వైపీసీ ఈ విధంగా చేసిందని కూటమి సర్కార్ పదేపదే చెబుతూ వస్తోంది. అధికారం పోయిన తర్వాత కూడా అదే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతున్నారు మాజీ సీఎం జగన్. ఏదైనా జిల్లాకు వచ్చిన ప్రతీసారీ పోలీసులపై విరుచుకుపడుతున్నారు. ఒకటీ రెండుసార్లు కాదు.. పదేపదే అదే రిపీట్ అవుతుంది. ఈ బెదిరింపుల వెనుక అసలు కథ వేరే ఉందన్నది ప్రత్యర్థుల నుంచి పడిపోతున్నాయి కౌంటర్లు.


ఇటీవల కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై రకరకాల కేసులు నమోదు అవుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు జగన్ ఈ స్కెచ్ వేసినట్టు కొందరు టీడీపీ నేతల మాట. ఆ విధంగా బెదిరిస్తే కొంతలో కొంతైనా కంట్రోల్ అవుతుందని భావించి ఇలా చేశారని అంటున్నారు. అధికారంలో లేనప్పుడు జగన్ ఇలా వ్యవహరిస్తే.. ఉన్నప్పుడు ఏ రేంజ్‌లో వ్యవహరించారో అర్థమవుతుందని అంటున్నారు.

దీన్ని షాకుగా చూపించి అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ రద్దు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు. ఆ విధంగా చేస్తే ప్రజల్లో మళ్లీ సింపతీ వస్తుందన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే పదేపదే పోలీసులపై మండిపడుతున్నారని అంటున్నారు.

ALSO READ: భక్తులు అలర్ట్.. గురువారం నుంచి ఆర్జిత సేవలు రద్దు

జగన్ ఏ జిల్లాకు వెళ్లినా జనం తండోప తండాలుగా వస్తుంటారు. వచ్చే ప్రతీ వ్యక్తికి రూ. 200 నుంచి రూ. 500 రూపాయలు ఇస్తుంటారని కొందరి నేతల మాట. ఈ పని చేయడానికి వైసీపీలో ప్రత్యేకంగా ఓ వింగ్ ఉందని అంటున్నారు. మంగళవారం అనంతపురం జిల్లాకు వెళ్లిన మాజీ సీఎం జగన్, చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు.

మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ

మీడియా ముందుకు వచ్చిన జగన్, పోలీసులపై కాసింత నోటి దురుసు ప్రదర్శించారు. దీనిపై ఆ జిల్లా ఎస్పీ రత్న కౌంటరిచ్చారు. మాకు పోలీస్ యూనిఫాం ఒకరు ఇచ్చింది కాదన్నారు. తాము కష్టపడి సాధించుకున్నామని,  ఒకవేళ తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా వీవీఐపీకి భద్రత కల్పించామని వివరించారు.

వైసీపీ అధినేత జగన్‌ (Jagan)కు మాస్ వార్నింగ్ ఇచ్చారు రామగిరి ఎస్ఐ సుధాకర్‌ యాదవ్‌.  దీనికి సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు మీరు ఇచ్చిన బట్టలు వేసుకున్నారని జగన్ అనుకుంటున్నారా? కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసయి పరీక్షల్లో విజయం సాధించిన తర్వాత వేసుకున్న యూనిఫాం అని అన్నారు.

మాటిమాటికీ వచ్చి బట్టలు ఊడ దీస్తామంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు. నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నామని, అలాగే ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ఆ విధంగా చస్తామని, అంతేకానీ అడ్డదారులు తొక్కమని అన్నారు. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడండి అంటూ జగన్‌ను మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఉద్యోగులను ఈ విధంగా భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నది ఆ ఎస్ఐ ఆందోళన. ఉద్యోగులకు భరోసా కల్పించాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. దీనిపై కూటమి సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.  మొదట్లో సైలెంట్‌గా ఉన్న పోలీసు అధికారులు క్రమంగా రియాక్టు అవుతున్నారు. మొత్తానికి జగన్ వేసిన ప్లాన్ ఏదో విధంగా ఫెయిల్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

 

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×