BigTV English

Road Accident: పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Road Accident: పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Road Accident in Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అలాగే మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.


వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరులో పరిధిలోని రాజానగర్ ప్రాంతంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. తిరుపతి నుంచి కడపకు వెళ్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు గాయపడిన ఆరుగురిని స్థానికంగా ఉన్న రైల్వే కోడూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కడప నుంచి పెళ్లి రిసెప్షన్ కోసమని ఇన్నోవా కారులో తిరుపతి వెళ్తుండగా.. తిరుపతి నుంచి కడపకు వస్తున్న ఏసీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోమ ఇన్నోవాా కారులో ఉన్న ముగ్గురు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇన్నోవాబ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పెళ్లి రిసెప్షన్ వెళ్తుండగా.. ఇలా జరగడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.


Also Read: వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి తగదాలు, ఆస్తులు సమంగా పంచకపోతే, కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది : వైఎస్ షర్మిల

మృతులంతా కర్నూల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందులో రావూరి ప్రేమ్ కుమార్(51), రావూరి వాసవి(48), సుచరిత(45)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి రైల్వేకోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×