Vizianagaram Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లోడ్ లారీ టిప్పర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈలోగా పోలీసులు వచ్చిన గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లోడ్ లారీ-టిప్పర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో టిప్పర్ కేబిన్‌లో ఇరుక్కుపోయారు లారీ డ్రైవర్, క్లీనర్. వాహనంలో నుంచి బయటకురాలేక తమను కాపాడాలంటూ అరుపులు, కేకలు వేశారు.
ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటలుపాటు వారిని కేబిన్ తీసే ప్రయత్నం చేశారు పోలీసులు, స్థానికులు. ఘటన జరిగిన ప్రాంతంలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు. మరో లారీలోని లారీ డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని 108 వాహనంలో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు