Gundeninda GudiGantalu Today episode September 22nd: మీనా ఆర్డర్ పూర్తి చేస్తే కనుక దాన్ని పట్టుకోవడం చాలా కష్టం ఎలాగైనా సరే.. ఈ విషయాన్ని చింతామణికి చెప్పాలి అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాదు పక్కకు వెళ్లి చింతామణికి ఫోన్ చేసి మీ నాకు డబ్బులు దొరికాయి అని చెప్పగానే చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏంటి మాస్టర్ మీరు అనేది డబ్బులు ఎలా దొరికాయి అంత డబ్బులు ఎవరిచ్చారు అంటూ అడుగుతుంది. ఇప్పుడు ఎవరిచ్చారు కాదు.. అక్కడ మీనాని ఎలాగైనా డబ్బులు కట్టకుండా ఆపాలి అని ప్రభావతి చెప్తుంది.. ఆ మాట వినగానే చింతామణి మిగతాదంతా నేను చూసుకుంటాను మాస్టర్ మీరు ఏమి కంగారు పడకండి అని అంటుంది.. మనము చింతామణికి చెప్పాను కదా తనే ఇప్పుడు మొత్తం చూసుకుంటుందిలే అని ప్రభావతి చాలా హ్యాపీగా ఉంటుంది.
మీనా తన స్నేహితులను కూడా మండపనికి రమ్మని చెప్తుంది అయితే డబ్బులు కట్టిన తర్వాత ఎలాగైనా సరే ఆర్డర్లని మనకే వస్తాయి కదా మనము వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి అని చాలా సంతోషంగా ఉంటుంది మీనా.. ఈ క్రమంలో ఎలాగైనా సరే మీనా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి అని చింతామణి ప్లాన్ చేస్తుంది.. నా మనషులను మీనా ను ఫాలో అవ్వమని చెప్తుంది. మీనా వెనకాలే ఫాలో అయిన చింతామణి మనుషులు ఆటో చెడిపోయిందని తెలుసుకొని మీన దగ్గర్నుంచి డబ్బులు కొట్టేస్తారు. మీనా డబ్బులు పోయాయని బాధ పడిపోతూ ఉండగా వాళ్లతో చాలా వరకి కొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ చింతామణి మనుషులు మాత్రం మీనా దగ్గర డబ్బులు లాక్కొని పారిపోతారు.. మీనా కోసం వచ్చిన వాళ్ళ స్నేహితులు డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తులను పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే అసలు కుదరదు వాళ్ళు స్పీడుగా వెళ్ళిపోతారు మీనా మాత్రం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు అక్క అంటూ చాలా బాధపడిపోతుంది. అయితే మీనా ఆ డబ్బులు అప్పు తెచ్చిన వక్క సుమతి డబ్బులు అక్క అంటూ చాలా బాధపడుతుంది ఇక మీనా చేతికి రక్తం కారిపోతుందని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు.
చింతామణి డబ్బులు కొట్టేసి దానికి మనుషుల్ని పంపించాం కదా ఇంకా వాళ్ళు కొట్టేసారా లేదా అని ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ ఆ దొంగలు డబ్బులు కొట్టేసాము అని చెప్పగానే చాలా సంతోషంగా వెళ్లి ఫంక్షన్ హాల్ కి సంబంధించిన పేమెంట్ చేయాలి అని అనుకుంటుంది. ఆ డబ్బులు తీసుకొని మీరు తొందరగా రండి అని చింతామణి మేనేజర్ కి డబ్బులు కట్టి చెప్తుంది. అయితే మేనేజరు చింతామణికే ఆర్డర్ వచ్చేలా చేస్తాడు. నేను ఎప్పటికైనా కట్టేదాన్నే అప్పుడే మీరు నాకు వ్యాపారు వచ్చింది అని చెప్తే నేను ముందే ఆ డబ్బులు కట్టేసి ఈ ఆర్డర్ నాకే వచ్చేలా చేసుకునే దానికదా అని అంటుంది చింతామణి.. మొత్తానికి చింతామణి మీనా దగ్గర డబ్బులు కొట్టేసి ఆర్డర్ తనకు రాకుండా చేశాను అని చాలా సంతోషంగా ఉంటుంది.
మీనా హాస్పిటల్లో బాధపడిపోతూ ఉంటుంది ఐదు లక్షలు డబ్బులు పోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు ఈ విషయం తెలిసి చాలా కంగారు పడిపోతూ హాస్పిటల్ కి వస్తాడు మీనాని ఆ పరిస్థితిలో చూసి బాధ పడిపోతాడు. ఇంత జరుగుతున్నా నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు నేను నీతో కావాలని గొడవ పడలేదు కదా నన్ను క్షమించు మీనా అని చెప్తాడు బాలు.. నేను నీ పరిస్థితిలో చూడలేకపోతున్నాను మీనా? నేను ఎంత స్పీడ్ లో వచ్చానో నాకే తెలియదు. కానీ నీకోసం అని ఆలోచించకుండా వచ్చేసాను అని బాలు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మీనా మాత్రం నేను మోసపోయానండి ఆ డబ్బులు దొంగలు కొట్టేశారు అది సుమతి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు అండి ఎలా కట్టాలని నాకు భయంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీన్ అనే చెప్పాలి.
ఈ మేన ఎక్కడికి వెళ్ళినా ఇంకా రాలేదు ఇంట్లో వాళ్ళందరూ కాఫీ అని అడుగుతూనే ఉన్నారు. ఈ మహారాణి ఎక్కడికి వెళ్లిందో ఊర్లో ఉన్న పంచాయతీలన్నీ ఈవిడ తీరుస్తున్నట్టు ఉంది అంటూ ప్రభావతి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. కాఫీ అంటూ ప్రభావతి దగ్గరికి వస్తారు. మీనా ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది అంటూ ప్రభావతి అరుస్తూ ఉంటుంది. అప్పుడే బాలు మీనా చేతికి కట్టుతో ఇంట్లోకి రావడంతో మిగిలిన వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు కానీ ప్రభావతి మాత్రం ఏం ఏం జరిగింది. ఎందుకు అంత పెద్ద కట్టు కట్టుకొని వచ్చావు చెయ్యమైనా విరిగిందా అని అడుగుతుంది. కానీ బాలు మాత్రం అసలు నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రభావతి మాత్రం లోలోపల సంతోష్ పడుతున్నా కూడా పైకి మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తుంది. మీద పరిస్థితిని చూసి అందరూ జాలి పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా సీరియస్.. పెద్ది, మనీష రొమాన్స్.. చక్రికీ లాయర్ షాక్..