E-Paper
Advertisement

మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!
Advertisement

Roja Slams AP Govt: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా నగరిలో ఆర్.కే రోజా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని విరుచుకుపడ్డారు. నీట్ కన్నా పెద్ద స్కామ్ డీఎస్సీలోనే జరిగిందని ఆరోపించారు. ఇటీవల భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సంలో కూటమి ప్రభుత్వం మోదీ భజన చేసిందని విమర్శించారు.

డీఎస్సీకి వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న వైసీపీ నేతలపై గుండాలతో దాడి చేయిస్తున్నారని రోజా ఆరోపించారు. కోడిగుడ్లు విసిరి.. విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. నీట్ స్కామ్ కంటే మెగా డీఎస్సీ స్కామ్ చాలా పెద్దదన్న రోజా.. కేంద్రమంత్రి ఎలా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో లోకేశ్ కూడా అలాగే రిజైన్ చేయాలన్నారు. అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినందుకు నైతిక బాధ్యత వహించాలని పట్టుబట్టారు.

Advertisement

నీటి పరీక్ష లీక్ అయిన వెంటనే దానిని రద్దు చేసి కేంద్రం మళ్లీ పరీక్ష నిర్వహించిందని రోజా గుర్తు చేశారు. తద్వారా నీట్ పై తన జవాబుదారి తనాన్ని చాటుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం జవాబు దారి తనానికి పట్టుబడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే.. సీఎం చంద్రబాబు రౌడీలతో దాడులు చేయిస్తున్నారని రోజా అన్నారు. మాట్లాడటం కూడా రాని మంత్రులతో తమను తిట్టిస్తున్నారని విమర్శించారు.

Also Read: జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

Advertisement

జగన్ దమ్ము గురించి చంద్రబాబు, లోకేశ్ కు బాగా తెలుసని రోజా అన్నారు. ఎన్ని దాడులు చేసిన వైసీపీ భయపడదని స్పష్టం చేశారు. విద్యార్థుల దెబ్బకు కేంద్రమే దిగివచ్చిందని.. అలాంటిది కూటమి ప్రభుత్వం తమ ముందు జుజుబీలని రోజా ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసేవరకూ వైసీపీ వెనక్కి తగ్గేది లేదని రోజా చెప్పుకొచ్చారు.

Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×