Longest Hair: భారత్ కు చెందిన రేణు ధరియాల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నిర్వహించిన అధికారిక పరిశీలనలో ఆమె జుట్టు పొడవును కొలవగా.. అది ఏకంగా 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు) ఉన్నట్లు తేలింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ వాడ్లో ఎత్తు (272 సెంటీమీటర్లు) కంటే రేణు జుట్టు పొడవు కొద్దిగా మాత్రమే తక్కువగా ఉండటం గమనార్హం.
అంతకుముందు ఈ పొడవైన జుట్టు రికార్డు.. ఉక్రెయిన్‌కు చెందిన అలియా నాసిరోవా పేరిట ఉండేది. అలియా జుట్టు పొడవు 257.33 సెంటీమీటర్లు (8 అడుగుల 5.3 అంగుళాలు) కాగా.. తాజాగా రేణు ఆమె రికార్డును తిరగరాశారు. ఇదిలా ఉంటే రేణు యూట్యూబర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా రాణిస్తూ పలువురు మహిళలకు అందానికి సంబంధించిన చిట్కాలను అందిస్తున్నారు.
Renu Dhariyal (India) has the longest hair in the world! 🩷
She has claimed the record for longest hair on a living person (female).
Her stunning raven tresses measure an unbelievable 271.50 cm (8 ft 10 in) long. pic.twitter.com/N8FeWdUGP0
— Guinness World Records (@GWR) August 7, 2026
అయితే తన జుట్టు ఇంత పొడవుగా పెరగడం వెనుక ఉన్న కారణాలను రేణు పంచుకున్నారు. తాను 2015 నుండి ఇప్పటివరకు జుట్టును ఒక్కసారి కూడా కత్తిరించలేదని చెప్పారు. భారతీయ సంస్కృతిలో పొడవైన జుట్టును అత్యంత సౌందర్యానికి, సాంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారని.. అదే తనకు జుట్టును ఇంతగా పెంచడానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం నిలబడినా కూడా తన జుట్టు నేలను తాకుతోందని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
🇮🇳 Meet Renu Dhariyal, the Indian woman who has set a Guinness World Record for having the world’s longest hair — measuring nearly 9 feet! 😳
She spends hours washing and detangling it, but says there are no expensive salon treatments or miracle products behind it.
Just years… pic.twitter.com/AG7n1FEnVe
— Kailash Vashi (@KailashVashi) August 8, 2026
Also Read: జియో చౌకైన 5G ప్లాన్.. దీనిని కొట్టేదే లేదు.. ఓటీటీ, కాల్స్, ఏఐ సేవలు అన్నీ ఫ్రీ!
అయితే బయటకు వెళ్లేటప్పుడు, సాధారణ సమయాల్లో జుట్టు నేలకు తగలకుండా ముడి వేసుకుంటున్నట్లు రేణు తెలిపారు. అయితే పెద్ద జుట్టును మెయిన్ టెన్ చేయడం అంతా తేలికైన పని కాదని పేర్కొన్నారు. శుభ్రం చేయడానికి ఎంతగానో శ్రమించాల్సి వస్తోందన్నారు. జుట్టును క్లీన్ చేయడానికి, అందులోని చిక్కులను తీయడానికే తనకు గంటల కొద్దీ సమయం పడుతుందోని పేర్కొన్నారు. దీనికి ఎంతో ఓపిక అవసరమని రేణు చెప్పుకొచ్చారు.
Also Read: భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!