E-Paper
Advertisement

జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే!

జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే!
Advertisement

South Central Railway New Rules: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రిజర్వేషన్ ఉన్న కోచ్‌ లలో సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతి లేకుండా ప్రవేశించకూడదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే నిబంధనలను కఠినతరం చేసినట్లు వెల్లడించింది. రిజర్వ్‌డ్ కోచ్‌ లలో సాధారణ టికెట్‌తో, సరైన అనుమతి లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులకు ఏకంగా రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రద్దీగా ఉండే రైళ్లలో జనరల్ టికెట్లు తీసుకున్న కొందరు ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లలోకి వెళ్లడం కనిపిస్తోంది. దీనివల్ల ముందుగానే సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు సీట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రిజర్వ్‌డ్ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని అతడి సీటులో కూర్చోకుండా అడ్డుకోవడం, ఇబ్బంది పెట్టడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించనున్నారు. ఇలాంటి సందర్భాల్లో రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. టికెట్ ఉన్న ప్రయాణికుడికి అతని రిజర్వ్ చేసిన సీటు, బెర్త్‌ పై పూర్తి హక్కు ఉంటుంది. ఇతరులు ఆ సీటులో కూర్చోవడం, ఖాళీ చేయకుండా ఉండటం, ప్రయాణికుడిని అడ్డుకోవడం లాంటి చర్యలను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించనున్నారు. అందుకే రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వ్‌ డ్ కోచ్‌లలోకి వెళ్లకుండా తమకు కేటాయించిన కోచ్‌ లోనే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

జరిమానా చెల్లించకపోతే కోర్టు చర్యలు

Advertisement

రైల్వే అధికారులు విధించిన జరిమానాను చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. జరిమానా చెల్లించని సందర్భాల్లో కేసును కోర్టుకు పంపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాంటి సందర్భాల్లో కోర్టు ద్వారా రూ.3,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చిన్న నిబంధన ఉల్లంఘనగా భావించి నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యం కోసమే నిబంధనలు

రిజర్వేషన్ కోచ్‌ లలోకి అనుమతి లేని ప్రయాణికులు ప్రవేశించడం వల్ల రైలులో రద్దీ పెరగడంతో పాటు, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, రాత్రి ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తమ టికెట్ ఏ కోచ్‌కు సంబంధించినదో ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. జనరల్ టికెట్ ఉన్నవారు రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

Advertisement

Read Also: విజయవాడ సహా 15 రైల్వే స్టేషన్లకు మహర్దశ.. PPP మోడల్‌ లో రీడెవలప్‌మెంట్!

Tags

Related News

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

Big Stories

Advertisement
×