Roja Tweet: ఎన్ని కేసులైనా పెట్టుకోండి. నేను వెనక్కు తగ్గను. మా పార్టీ తగ్గదు. మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా తగ్గరు. మేము మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ మాజీ మంత్రి రోజా కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా రోజా మరోమారు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ట్వీట్ చేశారు. ఈ సంధర్భంగా ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు రోజా. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకే దక్కుతుందన్నారు. తాజాగా రోజా తన ట్వీట్ ద్వారా నా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆ ప్రశ్నలు ఇవే..
అబద్దపు హామీలు ఇచ్చి సీఎం చంద్రబాబు చేసింది మోసం కాదా? యువతని మోసం చేశారు. మహిళలను మోసం చేశారు అలాగే రైతులను మోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. ఇస్తామని హామీ ఇచ్చారని, 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలని, బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించారన్నారు.
తల్లికి వందనం పథకం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తారన్నారని, రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలని, ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. అన్నదాత పథకంలో భాగంగా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అంటూ ప్రకటించారని, రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంటే బడ్జెట్ లో ఆ మాటే లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ అబద్దపు హామీలు ఇచ్చి, రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుందని, ఇప్పటి వరకు అతీగతీలేదన్నారు.
యువగళం పథకంలో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అంటూ ప్రకటించారని, ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి.. ఎప్పుడు ఇస్తారన్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్ అంటూ అబద్దపు హామీలు ఇవ్వగా, రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అంటూ కేవలం మాటకే పరిమితం చేసి బడ్జెట్ లో మాత్రం మొండి చెయ్యి చూపడం బాబు నైజం అన్నారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నారని, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, తనతో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారని, ఏమాత్రం తగ్గేదెలేదన్నారు రోజా. మరి ఈ కామెంట్స్ కి టీడీపీ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.
. @ncbn గారు.. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు!
నువ్వు చేసింది మోసం కాదా?
యువతని మోసం చేశారు
మహిళలను మోసం చేశారు
రైతులను మోసం చేశారుఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళ…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 14, 2024