Roja: వైసీపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలి గాళ్లు ఎక్కువయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ హైదరాబాద్ పారిపోతున్నారని.. రేపు అమెరికా వెళ్లాల్సి వస్తోందని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరిలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో రోజా మాట్లాడారు.
పవన్ కల్యాణ్‌కు పిచ్చి ముదిరింది..
‘ఇక.. పవన్ కల్యాణ్ కు అయితే పిచ్చి బాగా ముదిరిందని.. ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానని అంటున్నారు. తమిళనాడుకు వెళ్తాడు.. అక్కడే పుట్టి.. పెరిగా అని చెబుతాడు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లినప్పుడు ఇక్కడే పుట్టి పెరిగానని చెబుతాడు. ఈ విధంగా మాట్లాడడం వల్ల పవన్ కల్యాణ్ కు పిచ్చి ముదిరిపోయిందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా రోజా పవన్ కళ్యాణ్ ఓ సినిమా ఓ డైలాగ్ ను గుర్తుచేశారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. అనే డైలాగ్ ప్రకారం.. చంద్రబాబు నాయుడు బాగా లెక్క ఇస్తున్నట్టుంది.. పవన్ కల్యాణ్ కు ఆ తిక్క ముదిరి ముదిరి ఎక్కువ అవుతోంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు’ అని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం..
‘అందరూ వీకెండ్ కు ఫ్యామిలీ చూడడానికి వెళ్తారు.. కానీ పవన్ కల్యాణ్ మాత్రం వీకెండ్ లోనే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వెళ్తారు. అంత వరకు సినిమాలు చేసుకుంటారు.. డబ్బింగ్ లు చెబుతుంటారు. ఆయన సొంత కార్యక్రమాలు చేసుకుంటారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ హైదరాబాద్ కు పారిపోతున్నారు. రేపు జగన్ ప్రభుత్వం వచ్చాక వీళ్లు హైదరాబాద్ కాదు.. అమెరికా పారిపోతారు. అప్పుడు మిమ్మిల్ని కాపాడడానికి ఎవరూ ఉండరు. ఇప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగి ఇచ్చేస్తాం’ అని రోజా వ్యాఖ్యానించారు.
గాలి నా కొడుకులు ఎక్కువయ్యారు…
‘రాష్ట్రంలో గాలి నా కొడుకులు ఎక్కువయ్యారు.. ఒక్కడు కూడా రైతు దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారని.. పంటలు పండుతున్నాయా.. అని అడిగే నాయకుడు లేరు. రైతులు సంతోషంగా ఉన్నారని వీళ్లే చెబుతున్నారు. రైతుల దగ్గరు వద్దకు వెళ్లి చూస్తే తెలుస్తది..’ అని రోజా వ్యాఖ్యానించారు.
రోజా జైలుకెళ్లడం పక్కా..
మంత్రి రోజా వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఫైరవుతున్నారు. నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖల ద్వారా చేసిన డెవలప్ మెంట్ జీరో అని.. సభ్య సమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని అని అంటున్నారు. వైసీపీ హయాంలో రోజా కోట్లాది రూపాయల ప్రజాధనానని దోచుకున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అమె త్వరలోనే అరెస్ట్ అవ్వడం ఖాయమని జనసేన, టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.