BigTV English

Lady Don Aruna: అరుణ లోగుట్టు.. ఫోన్‌లో ఏకాంత వీడియోలు, నాలుగు రాష్ట్రాల్లో ఆగడాలు

Lady Don Aruna: అరుణ లోగుట్టు.. ఫోన్‌లో ఏకాంత వీడియోలు, నాలుగు రాష్ట్రాల్లో ఆగడాలు

Lady Don Aruna: లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారంలో ఏం జరుగుతోంది? రౌడీ షీటర్ శ్రీకాంత్-అరుణ దందాలు నాలుగు రాష్ట్రాల్లో విస్తరించాయా? ఓ మీడియా ఛానెల్‌‌ను అడ్డుపెట్టుకుని దందాకు పాల్పడిందా? ఈమెతోపాటు అరెస్టయి ఆ ముగ్గురు ఎవరు? ఉత్తరాది అమ్మాయిలతో టచ్‌లో ఉంటుందా? ఆమె ఫోన్ ఏకాంత వీడియోలు ఎందుకున్నట్లు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


రౌడీ‌ షీటర్ శ్రీకాంత్-ఆమె ప్రియురాలు అరుణ ఆగడాలు అన్నీఇన్నీకావు. పోలీసులు సేకరించిన విచారణలో తీగలాడితే డొంకంతా కదులుతోంది. పైకి అమాయకంగా కనిపించిన అరుణ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాంత్-అరుణ ఆగడాలు కేవలం ఏపీకి పరిమితం కాలేదు.

పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులున్నట్లు తెలుస్తోంది. అక్కడ నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను బయటకు తీస్తున్నారు పోలీసులు. అద్దంకి టోల్‌ప్లాజా వద్ద అరుణతోపాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అరుణ వ్యవహారంలో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు.


అరుణ గ్యాంగ్‌లో చాలామంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం అరుణను న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించింది. వెంటనే అరుణ అండ్ కో టీమ్ ని కావలి జైలుకి తరలించారు. జగన్ హయాం నుంచి నేరాలు, దందాలు, సెటిల్మెంట్ ఆరోపణల కేసులో ఆమెని ఏ-1గా పేర్కొన్నారట పోలీసులు.

ALSO READ: ఎమ్మెల్యే బుడ్డాపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, కేసు నమోదుకు పవన్ ఆదేశం

నార్మల్‌గా అరుణ ఓసీకి చెందిన వ్యక్తి. అయితే తాను ఎస్సీ మహిళ అంటూ చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఆమె వద్ద ఓసీ, ఎస్సీ పేరిట సర్టిఫికెట్లు ఉన్నట్లు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కొవూరు ఎమ్మెర్వో ఆఫీసులో ఎస్సీ పేరిట సర్టిఫికెట్ తీసుకున్నట్లు బయటపడింది.  మరో జిల్లాలో ఓసీగా ఆమె వద్ద పత్రాలు ఉన్నట్లు న్యాయవాదుల మాట.

అరెస్టు సమయంలో అరుణ వద్ద ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అసలు ఫోన్ ఇవ్వకుండా మరో ఫోన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో చివరకు అసలు ఫోన్‌ బయటపెట్టింది. అందులో ఆమె ఏకాంత వీడియోలు ఉన్నాయట. అందులో నెల్లూరు జిల్లా వివిధ శాఖల అధికారులు, రాజకీయ నేతలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో అరుణ కేసు వ్యవహారం పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైందని అంటున్నారు.  ఇదిలావుండగా జైలు నుంచి ఆసుపత్రికి శ్రీకాంత్‌ను తీసుకెళ్లిన ఆరుగురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్, నర్సు, అసిస్టెంట్‌లను సస్పెండ్ చేశారు.

ఎందుకంటే శ్రీకాంత్-అరుణ ఏకాంతం కోసం ఆసుపత్రిలో ఓ రూమ్‌ ఇచ్చారు. అందులో ఉన్న పేషెంట్లను మిగతా గదులకు తరలించారు. వారికి రూమ్ ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది బయట కాపాలా కాశారు. కాబోయే ఎమ్మెల్యే, హోంమంత్రిగా కావాలన్నది కలగా చెప్పుకునేదట అరుణ.

నెల్లూరు జిల్లాలో బయటకు రాని దాదాపు 10 హత్య కేసుల్లో ఈమె పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో దిశ ఛైర్మన్‌గా ఉన్న అరుణ, ఎన్ని కుటుంబాలకు అన్యాయం చేసింది? ఎంత వసూలు చేసింది? ల్యాండ్ సెటిల్మెంట్లు ఎన్ని చేసింది అనేదానిపై తీగలాగుతున్నారు పోలీసులు. బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా చీకటి కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నట్లు సమాచారం.

ఆమె ఫోన్‌లో లభించిన వీడియోలను న్యాయస్థానానికి సమర్పించనున్నారట అధికారులు. నెల్లూరులో ఓ హిజ్రా హత్య కేసులో 3 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. పోలీసుల విచారణలో అరుణ అసలు విషయాలు బయటపెడుతుందా? వారిని లోబరుచుకుంటుందా? అన్నదే అసలు ప్రశ్న.

Related News

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

CM Progress Report: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Big Stories

×