Gundeninda GudiGantalu Today episode August 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు కారును ట్రిప్ కోసం బుక్ చేసుకున్న వాళ్లంతా కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. అసలు అందరికి ఏమైందని అనుకుంటూ బాలు వెళ్తాడు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు.. తాగి డ్రైవ్ చేస్తున్నావా అని దారుణంగా అవమానిస్తారు. లైసెన్సులు తీసుకుని కార్ని సీజ్ చేస్తారు.. నేను తాగి డ్రైవ్ చేయలేదని చెప్పినా మీరు కారుని తీసుకెళ్తున్నారు ఏంటి అని పోలీసులతో అంటాడు. నువ్వేం మాట్లాడాలి అనుకున్న కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడుకొని కానిస్టేబుల్ చెప్తారు. ఇంట్లో ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు కూడా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు..
అప్పుడే మీనా వస్తుంది అందరూ మీనాని అంటారు. వాడు ఇలా తయారవ్వడానికి కారణం మీనా నేని ప్రభావతి మీనా ను దారుణంగా అవమానిస్తుంది. ఇది కంట్రోల్లో పెట్టుకుంటే వాడు ఎందుకు ఇలా తయారవుతాడు అని ప్రభావతి అంటుంది. బాలు తప్పు చేస్తే మీనాని ఎందుకంటారు అదేదో అతన్ని అడిగి తెలుసుకోండి అని మీ నాకు సపోర్టుగా నిలుస్తుంది.. మొత్తానికి బాలు తాగి రావడం వల్ల ఇంట్లో పెద్ద రచ్చే అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా పూలు డెలివరీ చేయడానికి వెళ్తే అక్కడ గుణకనిపించి ముందు మీ ఆయన కంట్రోల్ లో పెట్టుకో అక్క ఆ తర్వాత మమ్మల్ని అనొచ్చు అని అంటాడు. బాలు కారు డ్రైవర్ల దగ్గరికి వెళ్లి నేను తాగలేదని చెప్పినా కూడా పోలీసులు వినకుండా కారుని తీసుకుని వెళ్లారు.. మీరు కూడా నేను తాగానని నమ్ముతున్నారా అని అడుగుతాడు. ట్రిప్పు కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు తాగవు కదరా అది మాకు తెలుసు అని రాజేష్ అంటాడు. మౌనిక బాలు కి ఫోన్ చేసి నువ్వు తాగలేదని నేను నమ్ముతున్నాను అన్నయ్య నువ్వేం బాధపడకు నిజం బయటికి వస్తుంది అని ధైర్యం చెప్తుంది. గుణ కనిపించగానే మీనా సీరియస్ అవుతుంది. ఏంటక్కా మీ ఆయన ఇలా చేశాడు అని కావాలని అడుగుతాడు.
ఆయన హక్కు ధైర్యం నీకు లేవు అని మీనా అంటుంది. నేను అనడం కాదు అక్క ఊరంతా మీ ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అని గుణం అంటాడు. నాతో తిరిగితే శివ చెడిపోతాడు అది ఇది అని అన్నావు. ఇప్పుడు మీ ఆయన తాగి కార్ డ్రైవ్ చేస్తే ప్రమాదం అని పోలీసులు కారుని తీసుకెళ్లారు ఇది ఆలోచించు అని గుణ కావాలని మీనాను రెచ్చగొడతాడు.. మీనా ఏమనలేక వదిలేస్తుంది. పూలు డెలివరీ ఇవ్వడానికని ఒకరి దగ్గరకు వెళ్తే అక్కడ వాళ్ళు కూడా మీ ఆయన చేస్తారని అస్సలు అనుకోలేదు మీనా అని అంటారు.
అన్ని విషయాలు నా మాట వింటారు అక్క ఈ మందు విషయంలో మాత్రమే వినడు అని మీనా బాధని వ్యక్తపరుస్తుంది. అయితే మా ఆయన కూడా తాగొచ్చేవాడు మందు కల్పించాను అప్పటినుంచి తాగడం మానేశాడు అని ఆమె చెప్తుంది. ఆ మందు నాకు కూడా ఇప్పించండి అక్క మా ఆయనకి ఇస్తాను అని నేను అడుగుతుంది. ఆమె మీ నాకు మందు ఇప్పిస్తుంది. ఆ ముందుకు తీసుకెళ్లి మీనా బాలు కోసం తయారు చేసిన జ్యూస్ లో కలుపుతుంది. సత్యం ఫోన్ చేసి బయటికి రమ్మని అంటాడు.
ఏమంది మావయ్య బయటకు రమ్మని పిలిచారు అని అంటే మా యూనియన్ లో ఒక అతని కూతురు పెళ్లి అంట. నువ్వు దండలు చేసి ఇవ్వాలని ఆయన అన్నాడు ఇదిగో అడ్వాన్స్ అని ఇస్తాడు. బాలు కోరుకున్నట్లే నువ్వు రోజురోజుకీ వ్యాపారంలో వృద్ధి చెందుతున్నావు. వాడు కూడా మారితే సంతోషంగా ఉంటుంది అని అంటాడు. దానికి మీనా అది కూడా త్వరలోనే జరుగుతుంది లేండి మావయ్య అని లోపలికి వెళ్ళిపోతుంది. వంటగదిలో జ్యూస్ చేసి ఉండడం చూసిన ప్రభావతి. బాలు కోసం జ్యూస్ చేసిందా వాడికి అసలు జ్యూస్ లు అవసరమా అంటూ మొత్తం తాగేస్తుంది.
ఆ విషయాన్ని మీనా ప్రభావతికి చెప్తే కచ్చితంగా తిడుతుందని దానికి విరుగుడు మందు ఏమైనా ఉందేమో అని బయటికి వెళ్లిపోతుంది. అప్పుడే కామాక్షి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. మా ఇంట్లో వార్తలు చీటీ పాటలకి వచ్చేవారికి చెబుతున్నావా అని వెటకారంగా మాట్లాడుతుంది. కామాక్షి కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రభావతి పై పంచులు వేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ప్రభావతికి ఏదో తేడా కనిపించి వాష్ రూమ్ కి పరిగెడుతుంది. మళ్లీ వచ్చినప్పుడు మనోజ్ పాయసం కావాలని అడిగితే కోప్పడి మళ్లీ వెళ్తుంది.
కామాక్షి ఏమైంది అని సత్యము అడుగుతాడు. గండిపేట చెరువుకి గండి పడినట్లు ఉంది అన్నయ్య అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఏమైందో తెలియట్లేదు చాలాసార్లు పైకి కిందకి వెళ్ళింది ఇప్పుడు చేతకాక అక్కడే బాత్రూంలోనే పడిపోయింది ఏమో అని కామాక్షి అంటుంది. అందరూ పైకి వెళ్లి చూస్తే బెడ్ పై అడ్డంగా పడుకొని ఉంటుంది. ఏమైంది ఇలా పడుకున్నావ్ అంటే కామాక్షి కావాలనే సెటైర్లు వేస్తుంది. మీనా ఆ జ్యూస్ ని వాళ్ళ అత్తయ్య తాగిన విషయాన్ని ఆమెకి చెప్తుంది. ఆమెకు విరుగుడు మందుని ఇస్తుంది.
Also Read : ఆ ఛానెల్ పై సీరియల్ నటి ఫైర్… అసలేం జరిగిందంటే..?
ప్రభావతి అవస్థని చూసి బాలు డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తాడు. డాక్టర్ రాగానే ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అందుకే ఇలా ఉంది అని అంటుంది. అయితే మీనా మాత్రం ఒక జ్యూస్ లో పసరు కనిపిస్తుంది. ప్రభావతి కళ్ళు మూసుకొని మీనా చేసిన జ్యూస్ ని తాగాను అని ఉలిక్కిపడి లేచి అందరితోనూ చెప్తుంది. బాలు కోసమా జ్యూస్ కలిపానని అసలు నిజాన్ని బయటపెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..