BigTV English

Asia Cup 2025 : టీమిండియాను గాడిలో పెట్టేందుకు భీమవరం కుర్రాడు.. బీసీసీఐ అదిరిపోయే ప్లాన్

Asia Cup 2025 : టీమిండియాను గాడిలో పెట్టేందుకు భీమవరం కుర్రాడు.. బీసీసీఐ అదిరిపోయే ప్లాన్

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నమెంట్ లో టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్  ను టీమిండియా మేనేజర్ గా నియమించారు. దీంతో భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించినట్టయింది. త్వరలో జరుగనున్న ఆసియా కప్ టీ-20 టోర్నమెంట్ కు ఆయన భారత జట్టుకు మేనేజర్ గా వ్యవహరించనున్నారు. అయితే భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి అల్లుడు కూడా. అయితే ఆసియా కప్ సెప్టెంబర్ 09 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబీలలో జరుగనుంది.


Also Read : SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

28 ఏళ్ల తరువాత మరో తెలుగు వ్యక్తి.. 


గతంలో 1983లో వరల్డ్ కప్ విజయం సాధించిన సమయంలో టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఉండటం విశేషం. టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఉన్నారు. అతడి పేరు పి.ఆర్.మాన్ సింగ్. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్ గా వ్యవహరించారు. పీ.ఆర్. మాన్ సింగ్ 1938 నవంబర్ 24న జన్మించారు. అతను ఒక మాజీ క్రికెటర్.  1987 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టును కూడా నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘానికి కార్యదర్శిగా కూడా పనిచేశారు. తెలుగు వ్యక్తులు టీమిండియా మేనేజర్లుగా వ్యవహరిస్తే.. టీమిండియా విజయం సాధిస్తుందనే ఓ సెంటిమెంట్ కూడా ఉందని సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం విశేషం.
మరోవైపు 1997 వెస్టిండీస్ పర్యటనలోో భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా డీవీ సుబ్బారావు వ్యవహరించారు.  దాదాపు 28 సంవత్సరాల తరువాత ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అవకాశం దక్కడం విశేషం.

సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ 

యూఏఈలో సెప్టెంబర్ 09న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగనుంది. అప్గానిస్తాన్, హాంకాంగ్ పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక ఈ టోర్నీ కోసం   15 మందితో కూడిన భారత జట్టును  సెలక్షన్ కమిటీ ఇటీవలే ప్రకటించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ఎంపికయ్యారు. మరోవైపు  సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను పంచుకోబోతున్నారు.

టీమిండియా జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్‌ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), బుమ్రా, అర్షదీప్‌ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్‌, సంజు శాంసన్, హర్షిత్‌రాణా, రింకుసింగ్.

Related News

Shreyas Iyer : ఫ్యాన్స్ దెబ్బకు దిగివచ్చిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ కు కీలక పదవి… ఏకంగా కెప్టెన్సీనే

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు నో ఛాన్స్.. బీసీసీఐని బజారుకు ఈడ్చిన అంబటి రాయుడు !

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Big Stories

×