BigTV English

OTT Movie : మరిదితో యవ్వారం నడిపే భార్య… భర్త మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ … అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మరిదితో యవ్వారం నడిపే భార్య… భర్త మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ … అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : క్రైమ్ రేట్ ఎక్కువగా ఆస్తులు, అక్రమ సంబంధాల వలన జరుగుతున్నాయి. ఇప్పుడు క్రైమ్ స్టోరీలతో వచ్చే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, ఓటీటీ లో హల్ చల్ చేసింది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హ‌సీనా దిల్‌రుబ‌’ (Haseena Dillruba). 2021 లో విడుదలైన ఈ బాలీవుడ్ మూవీకి వినీల్ మాథ్యు దర్శకత్వం వహించారు. తాప్సీ, విక్రమ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో భర్తను హత్య చేసి తప్పించుకునే భార్య చుట్టూ స్టోరీ తిరుగుతుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఈ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

గ్యాస్ స్టవ్ పేలి భర్త రిషబ్ చనిపోవడంతో, భార్య రాణి మీద అనుమానంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఈ హత్య తాను చేయలేదని, ఆమె పోలీసులకు తన స్టోరీ చెప్తూ ఉంటుంది. రిషబ్ ఇంజనీరింగ్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి పెళ్లి చేయాలని, తల్లి పెళ్లిచూపులకి తీసుకు వెళుతుంది. అక్కడ రాణి అనే అమ్మాయిని చూసి పెళ్లికి ఒకే చెప్తాడు రిషబ్. రాణి కి వంటలు కూడా సరిగ్గా రాకపోవడంతో, తల్లికి ఇష్టం లేకపోయినా పెళ్లికి ఓకే అంటుంది. అలా వీళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుంది. రిషబ్ మోడ్రన్ గా కాకుండా సాధారణంగా ఉంటాడు. రాణి తన ఊహించుకున్న మొగుడు ఇతడు కాదని బాధపడుతుంది. తన అంచనాలకి రిషబ్ అందకపోవడంతో, వీళ్ళ సంసారం కాస్త స్లోగానే ఉంటుంది. రాణికి క్రైమ్ నవలలు చదవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ సమయంలోనే ఆ ఇంట్లోకి రిషబ్ కజిన్ నీల్ వస్తాడు. అతడు మోడ్రన్ గా ఉండటంతో అతన్ని ఇష్టపడుతుంది రాణి. వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కూడా ఒకటవుతారు. ఆ తర్వాత రాణిని దూరం పెడతాడు నీల్. తనని మోసం చేశాడని తెలుసుకొని బాధపడుతుంది రాణి. ఈ విషయం భర్తకు కూడా చెప్పి నన్ను క్షమించమని అడుగుతుంది రాణి.

అప్పటివరకు సైలెంట్ గా ఉన్న రిషబ్ కోపంతో రగిలిపోతాడు. ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. వాళ్లు అనే మాటలు రిషబ్ ను ఇంకా బాధపెడతాయి. ఆ తర్వాత ఇద్దరికీ ఒకసారి గొడవ జరుగుతుంది. ఆ గొడవలో నువ్వు సరిగ్గా ఉంటే, నీ భార్య నా దగ్గరికి ఎందుకు వస్తుందని చెప్తాడు నీల్. ఒకరోజు రిషబ్ ఇంటికి నీల్ వస్తాడు. అదే సమయంలో రిషబ్ కూడా అక్కడికి వస్తాడు. రిషబ్ తన భార్యను బయటికి పంపి, మటన్ తీసుకురమ్మని చెప్తాడు. రాణి బయటకి వెళ్ళగానే అక్కడ గ్యాస్ సిలిండర్ పేలుతుంది. ఈ ప్రమాదంలో రిషబ్ చనిపోతాడు. ఇదే స్టోరీని పోలీసులకు చెప్తుంది రాణి. ఆ తర్వాత రాణిని నిర్దోషిగా వదిలేస్తారు. చివరికి దిమ్మ తిరిగే క్లైమాక్స్ ట్విస్ట్ రెడీగా ఉంటుంది. అదేమంటే రిషబ్ బ్రతికే ఉంటాడు. అక్కడ చనిపోయింది నీల్. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడండి.

Tags

Related News

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : పెళ్ళైనా తీరని కోరిక… భార్యాభర్తలిద్దరిదీ అదే పరిస్థితి… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : డేటింగ్ యాప్ కోసం అమ్మాయి ఆరాటం… కితకితలు పెట్టే కామెడీ రొమాంటిక్ డ్రామా

OTT Movie : ఈ మూవీ ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది ? గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Big Stories

×