E-Paper
Advertisement

Sabari Express : పట్టాలపై ఇనుప రాడ్డు.. శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తప్పిన ముప్పు..

Sabari Express : పట్టాలపై ఇనుప రాడ్డు.. శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తప్పిన ముప్పు..
Advertisement

Sabari Express : సికింద్రాబాద్‌ నుంచి వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌కు ముప్పు తప్పింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్‌ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకోపైలెట్‌ మంజునాథ్‌ వెంటనే అప్రమత్తమై ట్రైన్ ను ఆపేశాడు. లేదంటే ఆ రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

స్పీడు తక్కువగా ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండానే రైలును ఆపగలిగారు. ఇంజినీరింగ్‌ సిబ్బంది, సహాయ లోకోపైలెట్‌లు వెళ్లి ఆ రాడ్డును తొలగించిన అనంతరం రైలు గుంటూరు స్టేషన్‌కు చేరింది. దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు తెలుస్తోంది. రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్‌ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టారు.

Tags

Related News

కంటతడి పెట్టిన వైసీపీ సీనియర్ బొత్స.. రాజకీయాల కోసం ఈ స్థాయికి దిగజారాలా?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×