E-Paper
Advertisement

మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.. ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో Redmi K90 Ultra వచ్చేస్తోందోచ్!

మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.. ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో Redmi K90 Ultra వచ్చేస్తోందోచ్!
Advertisement

Redmi K90 Ultra: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ బ్రాండ్ రెడ్‌మీ తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘రెడ్‌మీ K90 ఆల్ట్రా’ను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో K90, K90 Pro, K90 Max మోడల్స్ ఉండగా.. ఇప్పుడు ఈ కొత్త Ultra వెర్షన్‌ను కంపెనీ పరిచయం చేస్తోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలను, డిజైన్‌ను రెడ్‌మీ అధికారికంగా పంచుకుంది.

వచ్చే వారమే గ్రాండ్ ఎంట్రీ:

ఈ సరికొత్త రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ జూన్ 30న సాయంత్రం చైనాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన స్పేస్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో కంపెనీ టీజ్ చేసింది. దీని డిజైన్ దాదాపు K90 మ్యాక్స్ మోడల్‌ను పోలి ఉంటుంది. వెనుక వైపు పెద్ద హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ సొంతం.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, కూలింగ్ సిస్టమ్:

Advertisement

ఈ ఫోన్ పనితీరు విషయంలో రెడ్‌మీ అస్సలు తగ్గలేదు. దీనిలో క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం కెమెరా మాడ్యూల్ కింద ఒక ప్రత్యేకమైన ఎయిర్ అవుట్‌లెట్‌ను ఇచ్చారు. ఇది ఫోన్‌లోని యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కోసం పనిచేస్తుంది. దీనివల్ల ఎంత హెవీ గేమింగ్ ఆడినా ఫోన్ అస్సలు లాగ్ అవ్వదు.

Also Read: యాపిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కెమెరా అప్‌గ్రేడ్.. iPhone 18 Pro లీకైన వివరాలు చూస్తే మైండ్ బ్లాకే!

అదిరిపోయే డిస్ప్లే, భారీ బ్యాటరీ:

Advertisement

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.89 ఇంచుల 1.5K OLED డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి, ఇందులో ఏకంగా 8000mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, నీటిలో తడిసినా పాడవకుండా IP68 రేటింగ్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.

ముందే మొదలైన ప్రీ-బుకింగ్స్:

చైనాలో అధికారికంగా లాంచ్ కాకముందే ఈ ఫోన్ కోసం కంపెనీ ప్రీ-ఆర్డర్లను కూడా ప్రారంభించేసింది. జూన్ 30న జరిగే లాంచ్ ఈవెంట్‌లో దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు తెలియనున్నాయి.

Also Read: సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!

Related News

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

Big Stories

Advertisement
×