BigTV English

Viveka Murder Case : సీబీఐ విచారణ@ డే2.. వేర్వేరుగానే తండ్రీకొడుకులను ప్రశ్నిస్తున్న అధికారులు ..

Viveka Murder Case :  సీబీఐ విచారణ@ డే2.. వేర్వేరుగానే తండ్రీకొడుకులను ప్రశ్నిస్తున్న అధికారులు ..

Viveka Murder Case Latest News(AP Updates) : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాపు వేగంగా సాగుతోంది. ఎంపీ అవినాష్‌ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. బుధవారం కూడా అవినాష్ రెడ్డిని సీబీఐ సుధీర్ఘంగా విచారించింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అప్పటి వరకు అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.


మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. వారిని చంచ్‌లగూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. నిందితులను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సీబీఐ కోర్టు ఇది వరకే ఆదేశించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వెన్నెముక సమస్య కారణంగా భాస్కరరెడ్డి ఎక్కువ దూరం నడవలేకపోవడంతో సీబీఐ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో నిందితులు భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని వరకు ఆరు రోజులపాటు విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.


ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తోంది. ఈ నెల 24 వరకు వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. బుధవారం కూడా ముగ్గురు నిందితులను వేర్వేరుగా అధికారులు విచారించారు. హత్య ఘటనను నేరుగా ప్రస్తావించకుండా మొదటిరోజు పూర్తిగా వ్యక్తిగత వివరాలు, కుటుంబ వ్యవహారాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీయడంపైనే అధికారులు ఎక్కువగా దృష్టిపెట్టారని తెలుస్తోంది. తొలిరోజు విచారణకు కొనసాగింపుగా రెండురోజు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 25 తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని వార్తలు వస్తున్నాయి.

వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ అంశాన్ని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఎదుట ఆమె తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×