BigTV English

AP IAS Officers Transfers : ఏపీలో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ..

AP IAS Officers Transfers : ఏపీలో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ..
IAS Officers Transfers in Andhra Pradesh
IAS Officers Transfers

Senior IAS Transfers in Andhra Pradesh(Latest telugu news in ap) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కె. కన్నబాబును పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం.. బుడితి రాజశేఖర్ ను పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి బదిలీ చేసింది. వెంటనే సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బాధ్యతలతో పాటు.. పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, టూరిజం సీఈఓగా కన్నబాబుకు అదనపు బాధ్యతలను అప్పగించింది.


అలాగే జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. మత్స్యశాఖ కమిషనర్ గా ఎ. సూర్యకుమారిని నియమించింది. కె. హర్షవర్థన్ కు మైనారిటీ సంక్షేమశాఖ అదనపు బాధ్యతలు, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ గా ఉన్న డి. మురళీధర్ రెడ్డికి సెర్ప్ సీఈఓగా అదనపు బాధ్యతలు కేటాయించారు.

Read More : నలుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ.. హైదరాబాద్ సెంట్రల్ జోన్ DCPగా ఆకాంక్ష్


రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కె. వెంకట రమణారెడ్డికి సీసీఎల్ఏ కార్యదర్శి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ విధులకు రాజీనామా చేయడంతో.. ఆయన నిర్వహిస్తున్న మైనార్టీ సంక్షేమశాఖ అదనపు బాధ్యతలను సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ కు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×