BigTV English

YSRCP 9th List : ముగ్గురు ఇన్‌ఛార్జి లతో వైసీపీ 9వ లిస్ట్ విడుదల.. మంగళగిరిలో మళ్లీ మార్పు

YSRCP 9th List : ముగ్గురు ఇన్‌ఛార్జి లతో వైసీపీ 9వ లిస్ట్ విడుదల.. మంగళగిరిలో మళ్లీ మార్పు

ycp jagan news today


9th List of YSRCP Candidates(Andhra pradesh political news today) : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తుంది. ఇప్పటికే 8 లిస్టులు విడుదలవ్వగా.. తాజాగా 9వ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్టులో మూడు స్థానాలకు ఇన్ ఛార్జిల పేర్లను ప్రకటించింది. నెల్లూరు పార్లమెంటరీ నియోజవకవర్గ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది.

ఇక కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తున్నట్లు తెలిపింది. కాగా.. గతంలో మంగళగిరికి నియోజకవర్గానికి గంజి చిరంజీవిని నియమించిన అధిష్ఠానం ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఐఏఎస్ అధికారి అయిన ఇంతియాజ్ ఇటీవలే వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరారు. ఇక ఇప్పటి వరకూ ప్రకటించిన లిస్టుల్లో ఒకట్రెండు మార్పులు మినహా.. మిగతా ఇన్ ఛార్జులందరికీ దాదాపుగా టికెట్ ఖాయమేనని తెలుస్తోంది.


Read More : ఏపీలో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ..

మొత్తం వైసీపీ 9 లిస్టులను పరిశీలిస్తే.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు ఇన్ ఛార్జిల జాబితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11 అసెంబ్లీ, సెకండ్ లిస్టులో 24 అసెంబ్లీ, 3 ఎంపీ, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ, నాలుగో జాబితాలో 1 ఎంపీ, 8 అసెంబ్లీ, 5వ లిస్ట్ లో 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు, ఆరవ జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు, ఏడవ లిస్ట్ లో 2 అసెంబ్లీ, 8వ లిస్టులో 2 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు, 9వ జాబితాలో 1 పార్లమెంట్, 2 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించింది వైసీపీ.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×