BigTV English

Disqualification of 8 MLAs : స్పీకర్‌ తమ్మినేని సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Disqualification of 8 MLAs : స్పీకర్‌ తమ్మినేని సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

tammineni sitaram latest news


Disqualification of 8 MLAs in AP(AP political news): ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ.. సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల పార్టీలు మరిన వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై ఈ అనర్హత వేటు వేశారు. ఇరు పార్టీల నేతలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను విచారించి.. న్యాయ నిపుణుల సలహాతో ఈ నిర్ణయం తీసుకునట్లు స్పీకర్‌ తెలిపారు. మంగళవారం ఈ నిర్ణయంపై గెజిట్‌ వెలువడనుంది.


వైసీపీ ఫిర్యాదుతో ఆ పార్టీలోని నలుగురు రెబల్‌ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామ్, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లపై ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.

ఇటీవల విచారణ అనంతరం.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకునట్లు స్పీకర్‌ వెల్లడించారు. ఫిర్యాదుల అనంతరం జనవరి 29న తొలిసారి చర్చలకు పిలిచారు. ఈ చర్చలలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత విచారణకు సమయం ఇచ్చిన వారు హాజరు కాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.

Tags

Related News

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Big Stories

×