Hollywood: గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వాస్తవానికి సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. పైగా వీరికి కోట్లాదిమంది అభిమానులు కూడా ఉంటారు. వీరిలో కొంతమంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. మరికొంతమంది తమ గాత్రంతో శ్రోతలను అలరిస్తూ ఉంటారు. ఇక అలాంటివారు అనూహ్యంగా ఇక లేరు అని తెలిస్తే మాత్రం అభిమానులు జీర్ణించుకోలేరనే చెప్పాలి. ఈ క్రమంలోనే హాలీవుడ్ స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న లెజెండ్రీ పాప్ సింగర్ రోబెర్టా ఫ్లాక్ (Roberta Flack) కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో ఆమె మరణించడంతో అభిమానులు దుఃఖితులవుతున్నారు. ఇకపోతే ఈమె మరణానికి గల కారణాలను మాత్రం కుటుంబీకులు వెల్లడించలేదు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగానే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఇక ఫ్లాక్ మృతికి హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
రోబెర్టా ఫ్లాక్ కెరియర్..
రోబెర్టా ఫ్లాక్ విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు రోబెర్టా క్లియోపాత్రా ఫ్లాక్. ఈమె ఒక అమెరికన్ సింగర్ అలాగే పియానిస్ట్ కూడా.. 1937 ఫిబ్రవరి 10న బ్లాక్ మౌంటెన్, నార్త్ కరోలినా ,యూఎస్ఏ లో జన్మించారు. 1970 లలో స్టార్ సింగర్ లలో ఒకరిగా పేరు దక్కించుకున్న ఈమె పలు ఆల్బమ్ సాంగులతో పాటు అనేక సూపర్ హిట్ పాటలను కూడా పాడారు. ఆమె దశాబ్దాల కెరియర్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించిన ఈమె 2020లో గ్రామీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. ఫ్లాక్ కుటుంబ సభ్యులు కూడా స్టార్ సింగర్లు కావడంతో ఆ విధంగా ఈమెకు కలిసి వచ్చింది. 9 సంవత్సరాల వయసులోని పియానో వాయించడంలో ఆసక్తి చూపిన ఈమె యుక్త వయసు ప్రారంభంలోనే క్లాసికల్ పియానోలో భారీ పాపులారిటీ అందుకుంది. హోవర్డ్ విశ్వవిద్యాలయం ఈమె టాలెంట్ ను గుర్తించి సంగీత స్కాలర్షిప్ ను కూడా ప్రధానం చేసింది.
ఆ ఘనత సాధించిన ఫ్లాక్..
15 సంవత్సరాల వయసులోనే వాషింగ్టన్ డిసి లోని హోవర్డు విశ్వవిద్యాలయంలో చేరడంతో.. అక్కడ చేరిన అతి చిన్న వయస్కులలో ఒకరిగా పేరు దక్కించుకుంది. 19 సంవత్సరాల వయసులో హోవర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైన ఈమె.. అక్కడే సంగీతంలో గ్రాడ్యుయేట్ విద్యను ప్రారంభించింది. అయితే ఈమె తండ్రి ఆకస్మిక మరణం ఈమెను నార్త్ కరోలినాలోని ఫామ్ వెళ్లేలో సంగీతం అలాగే ఇంగ్లీష్ బోధించే ఉద్యోగాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అలా కెరీర్ ఆరంభించిన ఆమె ఆ తర్వాత ప్రొఫెషనల్ గాయకురాలిగా, గేయ రచయితగా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.