BigTV English

Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్

Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్

Ys Sharmila: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ సంచలన కామెంట్స్ చేశారు. తిరుపతి వారాహి సభలో రాహుల్ గాంధీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిళ ఘాటుగా స్పందించారు.


విజయవాడ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో షర్మిళ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని, దేశమంతా ఐక్యతను చాటి చెప్పేందుకు రాహుల్ గాంధీ భారత్ జూడో పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ఐక్యతను దెబ్బతీసేందుకు పవన్ ఒక మతం యొక్క బాధ్యతను మీద వేసుకుని ముందుకు సాగుతున్నారన్నారు. అధికారంలోకి రాకముందు ఒక రకం.. అధికారంలోకి వచ్చాక వేషం, భాష మార్చడం పవన్ కే సాధ్యమైందన్నారు. డిప్యూటీ సీఎం అనే గౌరవ హోదాలో ఉన్న పవన్ ఒక మతానికి చెందిన దుస్తులు ధరించి అఫిషియల్ డ్యూటీ చేస్తున్నారన్నారు. జనసేన పార్టీ మీద తమకు సెక్యులర్ పార్టీగా మంచి ఉద్దేశం ఉండేదని.. ప్రస్తుతం ఆ అభిప్రాయం మారి రైటిస్ట్ పార్టీగా భావిస్తున్నట్లు తెలిపారు.

మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారా అంటూ పవన్ ను సూటిగా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ కు ఏజెంట్ గా ఉన్నట్లు భావిస్తున్నానని, మోడీ డైరెక్షన్ లో పవన్ యాక్టింగ్ చేస్తున్నట్లు షర్మిళ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ లో జరిగిన ఊచకోత పవన్ కు నాడు కనిపించలేదా అన్నారు. .. బిజెపి సిద్ధాంతమే మత రాజకీయం కాగా.. అందులో భాగంగా జనసేన కూడా మత రాజకీయాలకు నెలవుగా మారిందన్నారు.. డిప్యూటీ సీఎం హోదాలో అన్నీ వర్గాలకు న్యాయం చేయాల్సిన పవన్.. ఒక మతానికి మద్దతు అంటూ ప్రకటించడం.. వేరే మతాల అభద్రతా భావానికి తెరతీశారని తెలిపారు.


Also Read: Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి.. టీటీడీ అలర్ట్..

రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నారని, అన్ని మతాలను సమానంగా చూస్తున్నారన్నారు. ఈ దేశంలో సోదర భావాన్ని పెంచుతున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడి, పవన్ మీ స్థాయిని దిగజార్చుకోవద్దని సూచించారు. బీజేపీ డైరెక్షన్ లో యాక్ట్ చేసే మీరు.. ఇకనైనా మేలుకోవాలన్నారు. పవన్ ను ఉద్దేశించి షర్మిళ తొలిసారిగా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అలాగే రాహుల్ గాంధీపై పవన్ కామెంట్స్ ని తప్పుబట్టిన షర్మిళ, ఒకేసారి పవన్ ను వేషం మార్చారు.. బాష మార్చారు అంటూ కామెంట్స్ చేయడం నేరుగా కాంగ్రెస్.. జనసేనకు గురి పెట్టిందా అంటూ చర్చలు ఊపందుకున్నాయి. మరి జనసేన.. ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×