BigTV English

Supremecourt : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే..

Supremecourt : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే..

Supremecourt : వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడం, కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను ఇటీవల జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని, అలాగే ఆయన లొంగిపోవాలని కోరారు. ఆయన్ను జూలై 1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు తామెప్పుడు చూడలేదన్నారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.

గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. తాము కూడా బెయిల్‌ రద్దును సవాలు చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామని తెలిపారు. ఆ పిటిషన్ ఇంకా లిస్ట్‌ కావాల్సి ఉందన్నారు. అన్నీ కలిపి విచారించాలని కోరారు. దీంతో జస్టిస్‌ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగా ఆ కేసును విచారించిన ధర్మాసనం.. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×