Big Stories

Jagan : సీఆర్డీఏ పరిధిలోని పేదల ఇళ్ల పట్టాల పంపిణీ .. ఈ ప్రాంతం ఇక సామాజిక అమరావతి : జగన్

Jagan : అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ చేపట్టారు. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీని ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఔట్లు సిద్ధం చేశారు.

- Advertisement -

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దేశంలో చాలా పోరాటాలు జరిగాయని సీఎం జగన్ అన్నారు. కానీ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి ఇళ్ల స్థలాలు ఇవ్వడం చారిత్రక ఘటనగా పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారని మండిపడ్డారు. అమరావతి ఇకమీదట సామాజిక అమరావతి అవుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వారంరోజులపాటు జరుగుతోందన్నారు. ప్రతి లే అవుట్‌ దగ్గరకు లబ్ధిదారులను తీసుకెళ్లి ఇంటి స్థలం చూపించి పట్టా ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. జులై 8న, వైఎస్ఆర్‌ జయంతి రోజు ఇల్లు నిర్మించే పనులకు శ్రీకారం చుడతామన్నారు.
ఇప్పటికే ల్యాండ్‌ లెవలింగ్‌, సరిహద్దు రాళ్లను పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తైందని తెలిపారు.

ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు 3 ఆప్షన్లు ఇస్తామన్నారు సీఎం జగన్. వారే నిర్మించుకుంటే రూ.1.8 లక్షలు ఇస్తామన్నారు. రెండో ఆప్షన్‌గా వారికి కావాల్సిన సిమెంట్, ఇసుక, స్టీల్‌ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తామని తెలిపారు. నిర్మాణ కూలి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని చెప్పారు. ఆప్షన్‌ -3గా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. పావలావడ్డీకే రూ.35 వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి ఇప్పిస్తున్నామన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు.

చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి మోసం చేశారని మండిపడ్డారు.
నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదన్నారు.తాను మేనిఫెస్టోలోని 98 శాతం వాగ్దానాలను అమలు చేశానన్నారు.
మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు? అని ప్రశ్నించారు. వారి దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికేనని అన్నారు.
ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్‌ వార్‌ అని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News