Gundeninda GudiGantalu Today episode August 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాధను చూసినా ఆ బారు ఓనర్ తో మీనాకు సీసీటీవీ ఫుటేజ్ ని చూపించమని తన మనిషితో చెప్తాడు.. ఓనర్ చెప్పిన విధంగా అక్కడ ఉన్న స్టాఫ్ మీనా కి సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తారు. అందులో మీన బాలుని చూసి షాక్ అవుతుంది. అయితే బాలు పెగ్గు కలిపి ఎమ్మెల్యేకు ఇవ్వడం అందులో కనిపిస్తుంది. బాలు బార్క్ రావడం చూసిన మీన అక్కడ ఎమ్మెల్యేకి మందు పోసినట్లు కనిపిస్తుంది. అయితే బాలు ఆ మందు తాగకుండా ఎమ్మెల్యే కి ఇవ్వడం చూసి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది..
కావాలనే మా ఆయన్ని ఇరికించారని బాధపడుతుంది. ఆరోజు బార్ల కూర్చున్న వాళ్ళందరి ఫుటేజ్ ని మీన చూస్తుంది. అయితే అక్కడ గుణ ఉండడం చూసి వీడే ఇదంతా చేసి ఉంటాడు అని అనుకుంటుంది.. ఆ వీడియోను మా మరిది రవికి పంపించండి అని అడుగుతుంది.. మొత్తానికి బాలు తప్పేమీ లేదని అందరూ తెలుసుకుంటారు. బాలు కారు కోసమని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ మీనా ను పొగుడుతాడు తప్ప బాలు తప్ప ఏమీ లేదన్నా కూడా పట్టించుకోవడంలేదని తెగ ఫీల్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా బాలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు..మీనా చేసిన ధైర్యానికి అక్కడున్న సిఐ వాళ్ళందరూ మెచ్చుకుంటారు.. బాలు మాత్రం నాది తప్పు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు మీనానే పొగుడుతున్నారని ఫీల్ అవుతుంటారు.. ఏది ఏమైనా కూడా నిజం అందరికీ తెలిసిపోయిందని సంతోషపడతారు. బయటికి రాగానే కారును తీసుకుని వెళ్లాలని బాలు అనుకుంటాడు. అందరూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే బాలు మీనాన్ని పొగిడాడు తప్ప నా తప్పేమీ లేదని ఒక్క మాట కూడా అనలేదని తెగ ఫీల్ అయిపోతాడు.
మీనా నన్ను అన్న మాటలన్నీ మిమ్మల్ని అనమని చెప్తాను పదండి అని అడుగుతుంది. అయితే బాలు మాత్రం ఏం అవసరం లేదులే నా భార్యను పొగిడారు అంటే నన్ను పొగిడినట్టే కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి శివ రావడం చూసిన మీనా ఇలాంటి వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అని అంటుంది.. ఈసారి మీ బావ కొట్టిన నేను అడ్డు రాను ఇకమీదట వాడికి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది.
లోపలికి వెళ్ళిన శివ గుణాన్ని చూసి బాధపడతాడు. శివ ఎక్కడ దూరం అవుతాడు అని గుణ తనకి అబద్దం చెప్తాడు. శివ అది నిజమే అనుకొని నమ్మేస్తాడు.. నువ్వేం భయపడకు గుణ నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను అని అంటాడు. సత్యం సంతోషంగా కేకలు వేస్తూ ఇంటికి వస్తాడు. ప్రభావతిపై సీరియస్ అవుతాడు. మనోజ్ ని రోహిణి శృతిని కిందకి రమ్మని చెప్పి బాలు తాగలేదు అన్న వీడియోని చూపిస్తాడు. అప్పటికి ప్రభావతి మనోజ్ నమ్మరు. అయితే సత్యం ఇంక మీదట నా కొడుకుని ఏదైనా అంటే అసలు ఊరుకోను అని అంటాడు.
హారతి ఇచ్చి బాలుని లోపలికి తీసుకొని వస్తారు. నిన్ను కూడా నేను అపార్థం చేసుకున్నాను రా నన్ను క్షమించు అని సత్యం అంటాడు. నువ్వు నన్ను క్షమించమని ఎందుకు నన్ను అడగడం… బాలు సత్యం మొత్తానికైతే ఒకటే పోతారు. అటు రోహిణికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఎందుకు నా భర్త అంటున్నావ్ ఇంకొకసారి అంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది.. ప్రభావతి ఏంటి వీడేదో కంప్లీట్ గా మానేసినట్టు అంటుంది.. బాలు మీనా లోపలికి వచ్చి సరదాగా ఉంటారు.
Also Read : ‘ఇంటింటి రామాయణం ‘ అక్షయ్ గురించి ఎవరికి తెలియని నిజాలు..!
మీనా నేను పూలు డెలివరీ ఇవ్వాలి అని వెళ్తుంది.. పోలీస్ వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడానికి వెళుతుంది అయితే అక్కడ మీనాన్ని చూసి నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మ అని మెచ్చుకుంటారు. అంతేకాదు అయితే బాలు ని ఇరికించడానికి కారణం సంజయ్ ని చెప్పడంతో మీనా షాక్ అవుతుంది.. మౌనిక తన అన్న మీద పడ్డ నింద పోయింది అని సంతోషంగా ఉంది. సంజయ్ ని ఇదంతా చేశాడని తెలుసుకొని సంజయ్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…